Home

»

Latest News

హీరో విశాల్ కు తప్పిన ప్రమాదం.. తలకి గాయమైనా షూటింగ్ కంటిన్యూ!

Jun 19, 2021 12:26PM

తమిళ స్టార హీరో విశాల్‌ కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాల్‌ ప్రస్తుతం 'నాట్ ఏ కామ‌న్ మేన్‌' అనే చిత్రంలో నటిస్తున్నాడు. హైదరాబాద్‌ లో ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఇందులో భాగంగా డూప్ లేకుండా ఫైట్ సీన్లో నటిస్తున్న విశాల్ తలకు ఓ సీసా తగిలింది. అయితే అదృష్టవశాత్తూ ఆయనకు పెద్దగా గాయాలు కాకపోవడంతో చిత్ర యూనిట్‌ ఊపిరి పీల్చుకుంది. షూటింగ్ లో ప్రమాదం జరిగినా బ్రేక్‌ తీసుకోకుండా విశాల్‌ నటించడం విశేషం.

ఈ ప్రమాదంపై విశాల్‌ స్పందిస్తూ.. తృటిలో తప్పించుకున్నానని, ఆ ఫైటర్‌ తప్పేమీ లేదని తెలిపారు. కొంచెం టైమింగ్‌ మిస్‌ అయ్యిందని, యాక్షన్‌ సీన్లలో ఇలాంటివి జరగడం సాధారణమేనని అన్నారు. భగవంతుడి దయ, అందరి ఆశీస్సులతో మళ్లీ షూటింగ్‌ కంటిన్యూ చేశామని చెప్పారు. 

కాగా, విశాల్ నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్ రవివర్మ ఆధ్వర్యంలో యాక్షన్ సీక్వెన్స్ లు తెరకెక్కిస్తున్నారు. ఫైట్‌ సీన్స్‌కు సంబంధించిన వీడియోను విశాల్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక విశాల్‌ 31వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శరవణన్ దర్శకత్వం వహిస్తుండగా.. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com