![]() |
![]() |

కన్నడ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత సంచారి విజయ్ (37) బ్రెయిన్-డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. జూన్ 12న ఫ్రెండ్‌ను కలుసుకొని, బైక్‌పై ఇంటికి తిరిగివెళ్తున్న సమయంలో యాక్సిడెంట్‌కు గురయ్యాడు విజయ్. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను వెంటనే బెంగళూరులోని అపోలో హాస్పిటల్‌కు తరలించారు.
రిపోర్టుల ప్రకారం ఆయన మెదడులోని కుడిభాగానికీ, తొడ ప్రాంతంలోనూ తీవ్ర గాయాలయ్యాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందిస్తున్న వైద్యులు ఈ రోజు (జూన్ 14) ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు. ఆయన అవయవాలను దానం చేయడానికి కుటుంబసభ్యుల నిర్ణయించుకున్నారు.
అంతకు ముందు విజయ్‌కు ట్రీట్‌మెంట్ అందిస్తోన్న న్యూరోసర్జన్ అరుణ్ నాయక్ మాట్లాడుతూ, "సంచారి విజయ్ పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టింది. ఆయనకు సర్జరీ నిర్వహించాం. రానున్న 48 గంటలు క్రిటికల్ కానున్నాయి." అని చెప్పారు. ఈరోజు సాయంత్రం విజయ్ బ్రెయిన్ డెడ్ అయినట్లు ఆయన వెల్లడించారు. ఈ రాత్రికి అవయవదానం ప్రాసెస్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు.
విజయ్‌కు ఈ రోజు మధ్యాహ్నం 12.25 గంటలకు ఓసారి, రాత్రి 7.50 గంటలకు మరోసారి అప్నియా టెస్టులను నిర్వహించారు. వీటిలో పాజిటివ్ అని తేలింది. దానర్థం ఆయన బ్రెయిన్ పూర్తిగా దెబ్బతింది. ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యాడు. ఆయన అవయవాలను భద్రపరచి ప్రోటోకాల్స్ ప్రకారం వివిధ హాస్పిటల్స్‌లో అవసరమైన వారికి అవయవ మార్పిడి చేస్తారు.
విజయ్ పార్థివదేహాన్ని మంగళవారం ఉదయం బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్రలో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం ఆయన స్వస్థలం పంచనహళ్లిలో రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
'రంగప్ప హోగ్‌బిత్న' (2011) అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంచారి విజయ్ అనంతరం పలు హిట్ సినిమాల్లో నటించాడు. 'నాను అవనల్ల అవలు' సినిమాలో ప్రదర్శించిన నటనతో నేషనల్ అవార్డ్ అందుకున్నాడు.
![]() |
![]() |