![]() |
![]() |

బుల్లితెరపై యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్.. వెండితెరపై డైరెక్టర్ గాను రాణిస్తున్నాడు. జీనియస్ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఓంకార్.. ఆ తర్వాత తీసిన సినిమా 'రాజుగారి గది'తో ఫస్ట్ సక్సెస్ అందుకున్నాడు. దీంతో అదే ఊపుతో రాజుగారి గది-2 తీసాడు. అది కూడా సక్సెస్ అవ్వడంతో.. రాజుగారి గది-3 తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ ఆదరణ పొందలేకపోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఓంకార్ త్వరలో రాజుగారి గది-4 తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఇటీవల ఓంకార్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాని కన్ఫర్మ్ చేశాడు.
'రాజుగారి గది 4' సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని అంటున్నారు. ప్రస్తుతం ఓంకార్ ఓ టీవీ ప్రోగ్రాం చేస్తున్నాడు. ఈ ప్రోగ్రాం అయిపోగానే రాజుగారి గది-4 ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్ లు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే ఓంకార్ టీవీ షోస్ చేస్తున్నాడని.. పరిస్థితులు చక్క బడగానే రాజుగారి గది-4 షూటింగ్ స్టార్ట్ చేస్తాడని అంటున్నారు.
కాగా రాజుగారి గది సిరీస్ అన్నింట్లో ఓంకార్ తమ్ముడు అశ్విన్ నటిస్తున్నాడు. ఈ సిరీస్ లో నాగార్జున, సమంత వంటి స్టార్స్ కీలక పాత్రలు చేసినా.. అశ్విన్ కి ప్రతి మూవీలోనూ ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకుంటాడు ఓంకార్. ఇప్పుడు రాజుగారి గది-4 ప్లాన్ చేస్తున్న ఓంకార్.. అశ్విన్ తో పాటు కీలక పాత్రల్లో ఎవర్ని ఎంపిక చేస్తాడో చూడాలి.
![]() |
![]() |