![]() |
![]() |

బద్రినాథ్ ఆలయానికి రక్షకుడిగా ఉండే ఓ యువ యోధుడు.. అనూహ్య పరిణామాల నడుమ ప్రేమలో పడ్డాక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? వాటిని ఎలా అధిగమించాడు? అనే పాయింట్ తో తెరకెక్కిన చిత్రం `బద్రినాథ్`. టైటిల్ రోల్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమాలో అతనికి జోడీగా `అలకనంద` పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా దర్శనమిచ్చింది. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రకాశ్ రాజ్, కెల్లీ దోర్జీ, అశ్విని కల్సేఖర్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, ప్రగతి, కోవై సరళ, సాయాజీ షిండే, ఎమ్మెస్ నారాయణ, రావు రమేశ్, మాస్టర్ భరత్, వేణు మాధవ్, ధర్మవరపు సుబ్రమణ్యం, కృష్ణ భగవాన్, రఘుబాబు, సుధ, గీతాసింగ్ నటించారు. స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ రూపొందించిన ఈ భారీ బడ్జెట్ మూవీని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించారు.
ఎం.ఎం. కీరవాణి స్వరకల్పనలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలన్నీ వీనులవిందుగా సాగాయి. మరీముఖ్యంగా.. ``నాథ్ నాథ్``, ``చిరంజీవ``, ``నచ్చావురా``, ``వసుధార`` గీతాలు సంగీతప్రియులను అలరించాయి. `బెస్ట్ ఆడియోగ్రాఫర్` (కె. దేవీకృష్ణ) విభాగంలో `నంది` పురస్కారం.. `బెస్ట్ కొరియోగ్రాఫర్` (ప్రేమ్ రక్షిత్ - ``నాథ్ నాథ్``) విభాగంలో `ఫిల్మ్ ఫేర్` అవార్డును అందుకుందీ చిత్రం. 2011 జూన్ 10న విడుదలై ఓ వర్గం ప్రేక్షకులను అలరించిన `బద్రినాథ్`.. నేటితో 10 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |