![]() |
![]() |

అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు- వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా అతి త్వరలో ఓటీటీ వేదికగా విడుదల కానుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఓ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సదరు వార్తలపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసే ఆలోచన తమకు లేదని.. ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తామని చిత్ర బృందం స్పష్టతనిచ్చింది.
కాగా లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అఖిల్ - పూజ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందనీ, ఈ ఇద్దరి మధ్య రొమాన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని చిత్రం బృందం చెబుతోంది. మరి ఈ జంట ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి.
మరోవైపు ఈ చిత్ర విజయం అటు హీరో అఖిల్, ఇటు డైరెక్టర్ భాస్కర్ కి చాలా కీలకం. హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇంతవరకు సక్సెస్ చూడని అఖిల్ ఈసారైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న 'బొమ్మరిల్లు' భాస్కర్ ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆశ పడుతున్నాడు.
![]() |
![]() |