![]() |
![]() |

శేఖర్ కమ్ముల లేటెస్ట్ ఫిల్మ్ 'లవ్ స్టోరి'లోని "సారంగ దరియా" సాంగ్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతూ పోతోంది. దాని దెబ్బకు మునుపటి రికార్డులు చెదిరిపోతున్నాయి. పవన్ సంగీతం సమకూర్చగా, సుద్దాల అశోక్‌తేజ రాసిన ఈ తెలంగాణ జానపద శైలి గీతం యూట్యూబ్‌లో 200 మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసి, అతి తక్కువ కాలంలో ఈ ఫీట్ సాధించిన టాలీవుడ్ సాంగ్‌గా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని మ్యూజిక్ కంపెనీ ఆదిత్యా మ్యూజిక్ తన అధికారిక ట్విట్టల్ హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. "#SarangaDariya from #LoveStory is now the fastest 200 million+ viewed Lyrical in Tollywood" అని అది ట్వీట్ చేసింది.
సాయిపల్లవి ఎప్పటిలాగే సూపర్బ్‌గా డాన్స్ చేయగా, మంగ్లీ అద్భుతంగా పాడిన ఈ పాట ఫిబ్రవరి 28న విడుదలైనప్పట్నుంచీ సంగీతప్రియులను అమితంగా అలరిస్తూ వస్తోంది. ఫిబ్రవరి 28న విడుదలైన ఈ పాట కేవలం 14 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్‌ను అధిగమించి, ఆ విషయంలో అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' మూవీలోని "బుట్టబొమ్మ" సాంగ్ రికార్డును బద్దలుచేసింది. అలాగే 32 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్‌ను సాధించిన ఈ సాంగ్ ఇప్పుడు 200 మిలియన్ వ్యూస్ మార్కును కూడా దాటేయడం విశేషం.
సాయిపల్లవి డాన్స్ చేసిన పాట ఇలా సెన్సేషన్ సృష్టించడం ఇదే మొదటి సారి కాదు. ఇదివరకు ధనుష్‌తో కలిసి డాన్స్ చేసిన "రౌడీ బేబీ" తమిళ్ సాంగ్ అయితే యూట్యూబ్‌ను షేక్ చేసి, 1 బిలియన్ వ్యూస్ సాధించిన తొలి ఇండియన్ సాంగ్‌గా చరిత్రలోకి ఎక్కింది. అలాగే 'ఫిదా'లోని "వచ్చిండే" సాంగ్ 300 మిలియన్ వ్యూస్‌ను సాధించింది.
సాధారణ పరిస్థితులు ఉన్నట్లయితే ఏప్రిల్‌లోనే 'లవ్ స్టోరి' మూవీ విడుదలై ఉండేది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం మాసిపోయి, థియేటర్లు తిరిగి తెరుచుకున్నాక ఈ సినిమాని విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
![]() |
![]() |