Home  »  News  »  రోమాలు నిక్క‌బొడిచే ఇంటెన్స్ యాక్ష‌న్‌తో కొమ‌రం భీమ్ వ‌చ్చేశాడు!

Updated : May 20, 2021

 

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ క‌ళ్లుకాయ‌లు కాచేలా ఎదురుచూసిన‌ ఆ లుక్ వ‌చ్చేసింది. య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి డైరెక్ట్ చేస్తోన్న దేశంలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అయిన 'ఆర్ఆర్ఆర్‌'లో కొమ‌రం భీమ్ ఇంటెన్స్ లుక్‌ను తార‌క్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ రోజు ఉద‌యం 10 గంట‌ల‌కు రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ నిన్న సాయంత్రం అనౌన్స్ చేయ‌గానే, ఫ్యాన్స్‌లో ఎగ్జ‌యిట్‌మెంట్ తారాస్థాయికి చేరింది. ఈ సినిమాలో తార‌క్ లుక్ ఎలా ఉంటుందో ఇదివ‌ర‌కే మ‌నం చూశాం. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో 'నీరు' (Water)కు ప్రాతినిధ్యం వ‌హించే పాత్ర‌గా తారక్‌ను రాజ‌మౌళి ప్రెజెంట్ చేయ‌డం చూశాం. ఆ త‌ర్వాత వ‌చ్చిన రామ‌రాజు ఫ‌ర్ భీమ్ టీజ‌ర్‌లో కొమ‌రం భీమ్‌గా తార‌క్ ఎలా చెల‌రేగిపోయాడో చూశాం. టీజ‌ర్ ఎండింగ్‌లో బ‌ల‌మైన తాళ్ల‌ను చేతుల‌తో బ‌లంగా లాగుతూ అత‌డు చూసిన చూపులోని తీక్ష‌ణ‌త‌ను చూశాం.

ఇదిగో ఇప్పుడు.. మేక‌ర్స్ అనౌన్స్ చేసిన ఇంటెన్స్ లుక్ పోస్ట‌ర్ వ‌చ్చేసింది. ఎడ‌మ చేతిని ముందుకు చాపి, కుడిచేతితో త‌న ఆయుధ‌మైన బ‌ల్లేన్ని విసురుతున్న భీమ్ వ‌చ్చేశాడు! అదిగో.. ఆ క‌ళ్ల‌ల్లో అదే ఇంటెన్సిటీ! ప్ర‌త్య‌ర్థిని వేటాడేందుకు సిద్ధ‌మైన‌ట్లు అదే తీక్ష‌ణ‌త‌!! నీలి చొక్కా.. గోచీ క‌ట్టిన తెలుపు పంచె.. న‌డుముకు క‌ట్టిన ఎరుపు వ‌స్త్రం.. నుదుటున పొట‌వాటి తిల‌కం.. కోర‌మీసం.. నీటిలోంచి చెంగున ఎగ‌రి బ‌ల్లేన్ని విసురుతున్న‌ట్లున్న కొమ‌రం భీమ్ లుక్‌తో తార‌క్ వ‌చ్చేశాడు. ఫ్యాన్స్‌కు పుట్టిన‌రోజు కానుక ఇచ్చాడు. ఆ ఇంటెన్స్ లుక్ పోస్ట‌ర్ చూసి నిజంగానే ఫ్యాన్స్ మంచి గిఫ్ట్ వ‌చ్చింద‌న్న సంబ‌రంతో పండ‌గ చేసుకుంటున్నారు.

ఆర్ఆర్ఆర్‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇంటెన్స్ లుక్‌ను త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్‌ ద్వారా షేర్ చేసిన డైరెక్ట‌ర్ రాజ‌మౌళి, "My Bheem has a heart of gold. But when he rebels, he stands strong and bold! Here’s @tarak9999 as the INTENSE #KomaramBheem from #RRRMovie." అంటూ ట్వీట్ చేశారు.

ఇక సినిమాలో సీతారామ‌రాజు పాత్ర‌ధారి, తార‌క్ ఫ్రెండ్ అయిన రామ్‌చ‌ర‌ణ్ త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్‌లో తార‌క్ పోస్ట‌ర్‌ను షేర్ చేసి, "Meet my dearest @tarak9999 as the mighty and intense #KomaramBheem from #RRRMovie. He's a rebel with a cause! Happy Birthday Brother." అంటూ రాసుకొచ్చాడు. 

అంతేనా! మూవీలో హీరోలిద్ద‌రికీ యుద్ధ‌విద్య‌లు నేర్పే గురువుగా క‌నిపించ‌నున్న బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ్‌గ‌ణ్ కూడా తార‌క్ లుక్‌ను షేర్ చేశారు. "The kind-hearted rebel #KomaramBheem is here! Here's @tarak9999 in his intense avatar from #RRRMovie. Wishing you a very Happy Birthday." అని ఆయ‌న ట్వీట్ చేశారు.

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇంటెన్స్ లుక్‌ను రాజ‌మౌళి షేర్ చేయ‌డం ఆల‌స్యం... క్ష‌ణాల్లోనే అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. తారక్ ఫ్యాన్స్‌తో పాటు, సినిమా ప్రియులు కూడా ఆ లుక్‌ను షేర్ చేసుకుంటూ ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వైర‌ల్ చేసేశారు.

350 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయ‌ల భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య నిర్మిస్తోన్న 'ఆర్ఆర్ఆర్‌:  రౌద్రం ర‌ణం రుధిరం' మూవీలో తార‌క్ జోడిగా బ్రిటిష్ యాక్ట‌ర్ ఒలీవియా మోరిస్‌, రామ్‌చ‌ర‌ణ్ జంట‌గా అలియా భ‌ట్ న‌టిస్తుండ‌గా, స‌ముద్ర‌క‌ని ఓ కీల‌క పాత్ర చేస్తున్నాడు. విల‌న్లుగా అమెరిక‌న్‌ యాక్ట‌ర్లు రే స్టీవెన్‌స‌న్‌, అలీస‌న్ డూడీ న‌టిస్తున్నారు. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌ను స‌మ‌కూర్చిన ఈ మూవీకి కీర‌వాణి సంగీతాన్నీ, సెంథిల్‌కుమార్ సినిమాటోగ్ర‌ఫీనీ స‌మ‌కూరుస్తున్నారు. 

ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న ఈ మూవీని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇదివ‌ర‌కే మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. క‌రోనా మ‌హ‌మ్మారి ప‌దే ప‌దే షూటింగ్‌కు ఆటంకం క‌లిగిస్తుండ‌టంతో ఆ స‌మ‌యానికి సినిమా రిలీజ్ అవుతుందో, లేదోన‌నే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. స‌మీప భ‌విష్య‌త్తులో ప‌రిస్థితులు మామూలుగా అయిపోయినా షూటింగ్ ఇంకా పూర్తి కానందున అప్ప‌టికి విడుద‌లయ్యే అవ‌కాశాలు లేవంటున్నారు. మొత్తానికి 2022 మొద‌ట్లో కానీ, స‌మ్మ‌ర్‌లో కానీ విడుద‌ల ఉండ‌వ‌చ్చ‌ని అంచ‌నా. చూద్దాం.. ఎప్పుడు రిలీజైనా కొమ‌రం భీమ్‌గా జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆడియెన్స్‌ను మెస్మ‌రైజ్ చేయ‌డం ఖాయం.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.