![]() |
![]() |

`అలా మొదలైంది` (2011)తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది కేరళకుట్టి నిత్యా మీనన్. మొదటి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.. ఆపై `ఇష్క్`(2012), `గుండెజారి గల్లంతయ్యిందే`(2013) వంటి యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ తో నటిగా మరింత గుర్తింపుని పొందింది.
ఇదిలా ఉంటే.. తెలుగునాట ఎక్కువగా మీడియం హీరోలతోనే సినిమాలు చేసే నిత్య.. అడపాదడపా స్టార్ హీరోల సినిమాల్లోనూ సందడి చేస్తోంది. `సన్ ఆఫ్ సత్యమూర్తి` (2015)లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తోనూ.. `జనతా గ్యారేజ్` (2016)లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తోనూ కలిసి నటించింది మిస్ మీనన్. ఈ రెండు సినిమాల్లోనూ నిత్య పాత్ర నిడివి తక్కువే. కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం మరో స్టార్ తో జట్టుకట్టనుంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ఆ స్టార్ మరెవరో కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో పవన్ కి జంటగా నిత్య సందడి చేయనుందని బజ్. విశేషమేమిటంటే.. ఇందులోనూ నిత్య చేయబోయే క్యారెక్టర్ చిన్నదేనట.మొత్తమ్మీద.. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నిత్య తక్కువ నిడివి ఉన్న పాత్రలకే పరిమితమవుతుండం విశేషం.
![]() |
![]() |