![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ కార్తి ఇప్పటివరకు రెండు సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశారు. ఆ చిత్రాలే.. `సిరుత్తై`, `కాష్మోరా`. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ `విక్రమార్కుడు` (2006)కి రీమేక్ గా రూపొందిన `సిరుత్తై`(2011) లో డీఎస్పీ రత్నవేలు పాండియన్, రాకెట్ రాజా పాత్రల్లో అలరించిన కార్తి.. `కాష్మోరా` (2017)లో కాష్మోరా, రాజ్ నాయక్ వేషాల్లో వినోదాలు పంచారు.
కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం ముచ్చటగా మూడోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు కార్తి. ఆ చిత్రమే.. `సర్దార్`. విశాల్ తో `ఇరుంబు తిరై` (తెలుగులో `అభిమన్యుడు`), శివకార్తికేయన్ తో `హీరో` (తెలుగులో `శక్తి`) సినిమాలను తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ పి.ఎస్. మిత్రన్.. `సర్దార్`ని రూపొందిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లో నెవర్ సీన్ బిఫోర్ లుక్ లో కనిపించి మెస్మరైజ్ చేశారు కార్తి. మరి.. ఫస్ట్ లుక్ లాగే సినిమా కూడా ఇంప్రెస్ చేస్తుందేమో చూడాలి.
`సర్దార్`లో కార్తి జోడీగా రాశీ ఖన్నా, `కర్ణన్` ఫేమ్ రజీషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. కార్తి గత రెండు చిత్రాలు `తంబి` (తెలుగులో `దొంగ`), `సుల్తాన్` నిరాశపరిచిన నేపథ్యంలో.. ఈ సినిమా విజయం తనకి ఎంతో కీలకంగా మారింది.
![]() |
![]() |