![]() |
![]() |
.jpg)
"హ హ హ హాసిని" అంటూ తెలుగువారి మదిలో నటిగా సుస్థిర స్థానం దక్కించుకుంది జెనీలియా. తన ఎనిమిదో తెలుగు చిత్రం 'బొమ్మరిల్లు'(2006)తో నాయికగా ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న జెన్నీ.. ఆపై 'ఢీ', 'రెడీ' వంటి సినిమాలతో సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. 2012లో విడుదలైన 'నా ఇష్టం' తరువాత తెలుగు తెరకు దూరమైంది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. తన తొలి కథానాయకుడు రితేష్ దేశ్‌ముఖ్ ని పెళ్ళాడాక.. హిందీ, మరాఠీ చిత్రాల్లో అతిథి పాత్రలకే పరిమితమైన జెన్నీ త్వరలో ఓ పూర్తి స్థాయి వేషంలో దర్శనమివ్వనుందట. అది కూడా.. తనకు డియర్ ఫ్రెండ్ అయిన ఓ తెలుగు హీరో సినిమాలో.
ఆ వివరాల్లోకి వెళితే.. ఎనర్జిటిక్ రామ్ కథానాయకుడిగా కోలీవుడ్ కెప్టెన్ లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ బైలింగ్వల్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి కథానాయికగా నటిస్తుండగా.. ఓ కీలక పాత్రలో జెనీలియా సందడి చేయనుందని ప్రచారం సాగుతోంది. అదే గనుక నిజమైతే.. 'రెడీ' (2008) తరువాత రామ్‌తో జెన్నీ నటించే సినిమా ఇదే అవుతుంది. త్వరలోనే '#RAPO19'లో జెనీలియా ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. ఈ రి-ఎంట్రీ జెనీలియాకి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
.jpg)
జెనీలియా వివాహం తర్వాత ఆమె ఫ్యామిలీ మొత్తానికీ ఫ్రెండ్ అయిపోయాడు రామ్. ఎప్పుడు ముంబైకి వెళ్లినా జెనీలియా ఇంటికి వెళ్లి ఆమె పిల్లలతో ఆడుకొని, బోలెడు కథలు చెప్పి కానీ తిరిగిరాడు. అలాంటి అనుబంధం జెన్నీ ఫ్యామిలీతో మెయిన్‌టైన్ చేస్తున్నాడు రామ్. ఆ క్లోజ్‌నెస్‌తోటే జెన్నీని తన సినిమాతో టాలీవుడ్‌కు రిఎంట్రీ ఇప్పిస్తున్నాడనేది టాక్.
![]() |
![]() |