![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన అతికొద్ది రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్ లో 'డార్లింగ్' ఒకటి. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన, ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నాయికగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కనువిందు చేసింది. "డార్లింగ్" అంటూ అందర్నీ అభిమానంగా పలకరించే ప్రభాస్.. ఆ పదాన్నే టైటిల్‌గా చేసుకుని సినిమా చేయడంతో టైటిల్ ఎనౌన్స్‌మెంట్ నుంచే ఈ చిత్రంపై ఎనలేని ఆసక్తి నెలకొంది. దానికి తగ్గట్టే సినిమా కూడా ప్రజాదరణ పొందింది.
శ్రద్ధా దాస్, ప్రభు, తులసి, చంద్రమోహన్, ముకేష్ రిషి, కోట శ్రీనివాసరావు, ఎమ్మెస్ నారాయణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచాయి. "ఇంకా ఏదో", "నీవే నీవే", "ప్రాణమా" వంటి మెలోడీస్ ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి.
.jpg)
'బెస్ట్ ఎడిటర్' (కోటగిరి వెంకటేశ్వరరావు), 'బెస్ట్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్' (ఆర్.సి.ఎం. రాజు) విభాగాల్లో ఈ చిత్రానికి 'నంది' పురస్కారాలు దక్కాయి. కన్నడంలో 'బుల్ బుల్', ఉర్దూలో 'దిల్ దీవానా' పేర్లతో 'డార్లింగ్' రీమేక్ అయింది. 2010 ఏప్రిల్ 23న విడుదలై విజయం సాధించిన 'డార్లింగ్'.. నేటితో 11 వసంతాలను పూర్తిచేసుకుంది.
.jpg)
![]() |
![]() |