![]() |
![]() |

`భరత్ అనే నేను`తో తెలుగువారిని అలరించిన ఉత్తరాది సోయగం కియారా అద్వాని. అంతకంటే ముందే.. హిందీ అనువాద చిత్రం `ఎమ్మెస్ ధోని - ది అన్ టోల్డ్ స్టోరీ`తో పలకరించింది ఈ టాలెంటెడ్ బ్యూటీ.
కాగా, ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. తాజాగా కియారా చేతిలోకి మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ చేరిందని టాక్. అదే.. `అనియన్` (అపరిచితుడు) రీమేక్. రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ రూపొందించనున్న ఈ రీమేక్ లో కియారా నాయికగా ఎంపికైందని కొద్దిరోజుల క్రితమే కథనాలు వచ్చాయి. ఇప్పుడు.. `అనియన్` రీమేక్ అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ తో కియారా ఎంట్రీని బలపరుస్తూ మళ్ళీ వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. హిందీలో కియారాకి ఇది మూడో రీమేక్ కానుంది. ఇప్పటికే `అర్జున్ రెడ్డి` రీమేక్ `కబీర్ సింగ్`, `కాంచన` రీమేక్ `లక్ష్మి`తో పలకరించింది. వీటిలో `కబీర్ సింగ్` సెన్సేషన్ క్రియేట్ చేయగా.. `లక్ష్మి` ఓటీటీలో విడుదలై తుస్సుమంది. ఈ నేపథ్యంలో.. `అనియన్` రీమేక్ తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
![]() |
![]() |