![]() |
![]() |

ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల నామినేషన్స్‌ను సోమవారం ప్రకటించిందెవరో తెలుసా.. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన మన తార ప్రియాంకా చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్. నిక్.. స్టార్ సింగర్, పర్ఫార్మర్ అనే విషయం తెలిసిందే.
మార్చి 15న తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తన బ్యూటిఫుల్ వైఫ్ ప్రియాంకా చోప్రాతో కలిసి ఆస్కార్ నామినేషన్స్‌ను అనౌన్స్ చేస్తున్నప్పటి స్టన్నింగ్ పిక్చర్స్‌ను షేర్ చేశాడు. "ఈ మార్నింగ్ ఆస్కార్ నామినేషన్స్‌ను ఒక ఆస్కార్ నామినేటేడ్ ఫిల్మ్ (ది వైట్ టైగర్)లో నటించి, ప్రొడ్యూస్ చేసిన ఈ బ్యూటిఫుల్ వుమన్‌తో కలిసి అనౌన్స్ చేశాను. నామినీస్ అందరికీ కంగ్రాట్స్. ఏప్రిల్ 25న (ఆస్కార్ వేడుక)న చూస్తాను. @priyankachopra.” అని రాసుకొచ్చాడు.
.jpg)
నామినేషన్స్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్ అనంతరం తన ఎగ్జయిట్‌మెంట్‌ను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంది ప్రియాంక. "నా సొంత ఆస్కార్! నీతో కలిసి ఈ క్షణాలను షేర్ చేసుకోవడం ఎంతో లవ్‌లీగా ఉంది నిక్. ఐ లవ్ యు. Catch the oscars on April 25th!” అని ట్వీట్ చేసింది.
.jpg)
కలర్-కోఆర్డినేటెడ్ డ్రస్సుల్లో మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఆ ఫొటోల్లో కనిపిస్తున్నారు ప్రియాంక, నిక్. వయొలెట్-బ్లూ కలర్ స్కర్ట్, టాప్‌లో ప్రియాంక అదరగొడుతుంటే, వైట్ షర్ట్‌పై గోల్డ్ కలర్ టక్సెడో, అదే కలర్ ట్రౌజర్‌తో ఆకట్టుకుంటున్నాడు నిక్ జోనాస్.
.jpg)
![]() |
![]() |