![]() |
![]() |

సింగర్ సునీత కొద్ది రోజుల క్రితం భర్త రామ్ వీరపనేనితో కలిసి మాల్దీవులకు హనీమూన్ వెళ్లారు. సరదాగా సమయాన్ని గడిపారు. దశాబ్ద కాలం సింగిల్ మదర్‌గా ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్దచేసిన ఆమె, ఇన్నాళ్లకు తనను ప్రేమించిన, తనకు నచ్చిన జీవిత భాగస్వామిని రామ్‌లో చూశారు. ఆయన పెళ్లి ప్రపోజల్ తీసుకురావడంతో, టీనేజ్ దాటిన తన ఇద్దరు పిల్లలు ఆకాశ్, శ్రేయతోనూ, తన తల్లిదండ్రులతోనూ మాట్లాడి, వారు అంగీకరించడంతో రెండో వివాహం చేసుకున్నారు.
.jpg)
పెళ్లి వేడుకలో సునీత ముఖంలోని ఆనందం, నవ్వులు గతంలో ఎన్నడూ చూడలేదని ఆమె సన్నిహితులు చెప్పారు. ఆ తర్వాత ఆమె రామ్‌తో కలిసి మాల్దీవులకు వెళ్లారు. అక్కడి బీచ్‌లో చిన్నపిల్లలా కేరింతలు కొట్టారు, ఆడారు, పాడారు. తను ఎలా ఉండాలనుకున్నారో అలా గడిపారు. దానికి సంబంధించిన కొన్ని మధుర క్షణాలను ఫొటోల రూపంలో నిక్షిప్తం చేశారు.
.jpg)
లేటెస్ట్‌గా వాటిలో కొన్నింటిని తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. వాటికి "No caption needed" అనే క్యాప్షన్ పెట్టారు. ఒక బ్లాక్ కలర్ హార్ట్ ఎమోజీనీ జోడించారు. ఆ పిక్చర్స్‌లో ఎక్కువగా తను సోలోగా ఉన్నవే ఉన్నాయి. ఒక్క ఫొటో మాత్రం భర్తతో బోట్‌లో ప్రయాణిస్తూ తీయించుకున్నది షేర్ చేశారు. మిగతా ఫొటోలన్నింటిలోనూ రెడ్ టీ-షర్ట్, బ్లూ జీన్స్‌లో కనిపిస్తున్నారు సునీత. ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.
.jpg)
కామెంట్స్ సెక్షన్‌లో ఆమె నవ్వు బాగుందనీ, ఇంత ఆనందంగా మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటగా ఉందనీ, జీవితంలో ఎప్పుడూ ఇలాగా ఆనందంగా ఉండాలనీ కోరుకుంటూ పలువురు అభిమానులు, శ్రేయోభిలాషులు పోస్టులు పెట్టారు.
.jpg)
![]() |
![]() |