![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రేమికుడి పాత్రలో నటిస్తున్న సినిమా 'రాధేశ్యామ్'. బుట్టబొమ్మ పూజాహెగ్డే నాయికగా నటిస్తున్న ఈ పిరియడ్ రొమాంటిక్ సాగాని 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ రూపొందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ.. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. కాగా, వేలంటైన్స్ డే స్పెషల్ గా ఈ సినిమా గ్లిమ్స్ ని రిలీజ్ చేసిన యూనిట్.. అదే వీడియోలో రిలీజ్ డేట్ ని జూలై 30గా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ప్రభాస్ ఎంటైర్ కెరీర్ లో జూలై నెలలో విడుదలైన ఒకే ఒక సినిమా.. 'బాహుబలి - ది బిగినింగ్' మాత్రమే. 2015 జూలై 10న రిలీజైన ఈ ఫోక్ లోర్ విజువల్ వండర్.. థియేటర్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి.. అచ్చొచ్చిన నెలలో 'రాధేశ్యామ్'తో మరోసారి పలకరించనున్న ప్రభాస్.. ఆ స్థాయి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని మరోమారు తన ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.
'రాధేశ్యామ్'లో రెబల్ స్టార్ కృష్ణంరాజు అతిథి పాత్రలో నటించగా, భాగ్యశ్రీ, జయరామ్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.
![]() |
![]() |