![]() |
![]() |

తమిళంలో టాప్ స్టార్స్‌లో అజిత్ ఒకరనే విషయం తెలిసిందే. అయితే హిందీ ఆడియెన్స్‌లోనూ ఆయనకు భారీ సంఖ్యలో అభిమానులున్నట్లు తెలిసి వస్తోంది. ఫిల్మ్ బిజినెస్‌లో ఉన్నవాళ్లు ఈ విషయాన్ని గ్రహించారు. ఆయన మునుపటి మూవీ 'విశ్వాసమ్' తమిళనాటే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ విజయం సాధించింది.
దక్షిణాది పాపులర్ హీరోల సినిమాలను హిందీలో డబ్ చేసి, యూట్యూబ్‌లో విడుదల చేసే కొన్ని కంపెనీలున్నాయి. అజిత్ నటించిన తమిళ సినిమాల హిందీ ఆన్లైన్ వెర్షన్లకు మంచి వ్యూస్ వస్తున్న విషయం ఆ కంపెనీలు గమనించాయి. ఈ ధోరణి 'వేదాళమ్' మూవీతో మొదలైందని తెలుస్తోంది. దానికి అనూహ్య స్థాయిలో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఆ కంపెనీలు అజిత్ వేవ్‌ను క్యాష్ చేసుకోవడానికి ఆయన ఇదివరకు నటించిన బిల్లా, వరలారు, యెన్నై అరింధాల్, వీరమ్ సినిమాలను హిందీలో డబ్ చేసి, ఆన్లైన్లో రిలీజ్ చేయడానికి హడావిడి పడుతున్నారు.
అజిత్ ప్రస్తుతం హెచ్. వినోద్ దర్శకత్వంలో 'వాలిమై' సినిమా చేస్తున్నాడు. పోలీసాఫీసర్‌గా నటిస్తున్న ఆయన జోడీగా హ్యూమా ఖురేషీ నటిస్తోంది. వాస్తవానికి దీపావళికి ఆ మూవీని రిలీజ్ చేయాలనుకున్నారు కానీ మహమ్మారి కారణంగా షూటింగ్లో జాప్యం జరగడంతో తదనుగుణంగా విడుదల కూడా వాయిదా పడింది. సెప్టెంబర్‌లో దాని షూటింగ్‌ను పునరుద్ధరించారు.
![]() |
![]() |