![]() |
![]() |

బిగ్ బాస్ 4లో తమ అభిమానాన్ని అమితంగా పొందుతోన్న అభిజీత్‌ను హోస్ట్ నాగార్జున టార్గెట్ చేశారని వీక్షకులు అభిప్రాయపడుతున్నారు. శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో దెయ్యం (జలజ) ఇచ్చిన టాస్క్‌లను కంటెస్టెంట్లు తిరస్కరించడం తనను బాగా అసంతృప్తికి గురిచేసిందని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. టాస్క్‌ను రిజెక్ట్ చేసిన అభిజీత్‌నును వరస్ట్ పర్ఫార్మర్‌గా బిగ్ బాస్ పేర్కొన్నాడు. అతనికి లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్ దక్కవని స్పష్టం చేశాడు. దీన్ని బట్టి అతడిని నిర్వాహకులే టార్గెట్ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాళ్ల పర్ఫార్మెన్స్ వెనుక కారణాల్ని వివరించమని హౌస్‌మేట్స్‌ను బిగ్ బాస్ అడగడంతో, అందరూ వివరించారు. ఫైనల్ రేస్ మొదలైంది కాబట్టి, ఇక్కడ్నుంచి హౌస్ కెప్టెన్‌లు అనేవాళ్లు ఉండని బిగ్ బాస్ ప్రకటించాడు.
టాస్క్ రిజెక్ట్ చేసినందుకు అభిజీత్ క్షమాపణలు చెప్పాడు. అతను డేంజర్ జోన్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అతని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మిగతా హౌస్‌మేట్స్ అందరూ అతడిని టార్గెట్ చేసి నామినేట్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని వారాలుగా మిగతా వారితో పోలిస్తే అభిజీత్‌కు విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనీ, ఓవర్ యాక్టింగ్ చేయకుండా తన గేమ్ తాను ఆడుకుంటూ వెళ్తున్నాడనీ, అందరిలోనూ అతనే కాస్త హుందాగా కనిపిస్తున్నాడనీ వీక్షకులు ఫీలవుతున్నారు. అతనికి బలమైన ప్రత్యర్థి అఖిల్ సార్థక్ అనీ, ఆ ఇద్దరిలో ఒకరు విన్నర్ ట్రోఫీని అందుకుంటారనీ వారు భావిస్తున్నారు.
![]() |
![]() |