![]() |
![]() |

ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్ దంపతులు బాలీవుడ్ పార్టీలలో కానీ సామాజిక సమావేశాలలో రెగ్యులర్ కనిపించరు. కాని వారిద్దరూ ఆనందించే ఒక విషయం.. కుటుంబంతో గడపడం. ఈ జంట వారి షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ వారి సన్నిహితుల కోసం ఎప్పుడూ టైమ్ కేటాయిస్తారు. ప్రతి సంవత్సరం ఆమిర్, కిరణ్ తమ కొడుకు ఆజాద్ పుట్టినరోజును పూర్తి ఉత్సాహంతో, స్పెషల్ థీమ్‌తో సెలబ్రేట్ చేస్తుంటారు. ఈ సంవత్సరం అందుకు భిన్నంగా లేదు.
ఆజాద్ అక్కయ్య, ఆమిర్‌కు మొదటి భార్య రీనా దత్తా ద్వారా కలిగిన సంతానం ఐరా దత్తా గురువారం తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన తమ్ముడి తొమ్మిదో పుట్టినరోజుకు సంబంధించిన కొన్ని పిక్చర్స్‌ను షేర్ చేసింది. వాటికి, “Cutttiiieeepaaatoootttiiieee Happy Birthday! To the coolest baby brother I could have asked for #happybirthday #birthdayboy #minecraft #forcedloved #stealhugs”. అనే క్యాప్షన్ జోడించింది. స్వీట్! కాదంటారా?

.jpg)

![]() |
![]() |