![]() |
![]() |

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు రూపొందించిన పలు చిత్రాల్లో కీలక భూమికలను ధరించారు సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి. కట్ చేస్తే.. ఇప్పుడు భరణి దర్శకత్వంలో రాఘవేంద్రరావు నటించబోతున్నారట. అది కూడా అతిథి పాత్రలో కాదు.. ప్రధాన పాత్రలో.
ఆ వివరాల్లోకి వెళితే.. స్వర్గీయ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, వెటరన్ యాక్ట్రస్ లక్ష్మి కాంబినేషన్ లో మిథునం వంటి అవార్డ్ విన్నింగ్ మూవీని తెరకెక్కించిన భరణి.. సుదీర్ఘ విరామం తరువాత మెగాఫోన్ పట్టనున్నారట. కె.రాఘవేంద్రరావుని దృష్టిలో పెట్టుకుని మిథునంలాగే ఓ వైవిధ్యభరిత కథాంశాన్ని తయారుచేసుకున్నారట భరణి. స్క్రిప్ట్ నచ్చడంతో దర్శకేంద్రుడు కూడా ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కె. రాఘవేంద్రరావు వయసుకు తగ్గట్టే హుందాగా ఉండే పాత్ర ఇదని సమాచారం.
మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |