![]() |
![]() |

టాలీవుడ్‌లోని అగ్రశ్రేణి సంగీత దర్శకుల్లో రాక్‌స్టార్ దేవి శ్రీప్రసాద్ ఒకరు. నిజం చెప్పాలంటే ఏడాది క్రితం ఆయనే టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్. అందరికంటే ఆయన రెమ్యూనరేషనే ఎక్కువ అని ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఏడాది నుంచీ పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. 'అల.. వైకుంఠపురములో' మూవీ సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ కావడంతో తమన్ క్రేజ్ అమాంతం పెరిగి, దేవి డౌన్ అయ్యారు. అయితే ఇప్పుడు దేవికి సంబంధించిన న్యూస్ ఒకటి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతూ అందర్నీ ఆశ్చర్యానికి లోనుచేస్తోంది.
ఆ న్యూస్ ప్రకారం దేవి తన రెమ్యూనరేషన్ పెంచేశారంంట. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించే 28వ సినిమాకి ఆయన రెండు కోట్లను అందుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ మూవీని హరీశ్ శంకర్ డైరెక్ట్ చేయనుండగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నది. సుకుమార్ డైరెక్ట్ చేసిన 'రంగస్థలం' మూవీకి ఇదే నిర్మాతలు దేవికి 1.5 కోట్లను ఇచ్చారు.
కాగా ఇటీవల దేవి మ్యూజిక్ అందించిన 'ఉప్పెన' అనే చిన్న సినిమా సాంగ్స్ బాగా పాపులారిటీ తెచ్చుకున్నాయి. ఇందులోని "నీ కన్ను నీలి సముద్రం" పాట చార్ట్‌బస్టర్ అయ్యింది. పంజా వైష్ణవ్‌తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తున్న ఈ మూవీని నిర్మిస్తోంది కూడా మైత్రి మూవీ మేకర్స్ కావడం ఇక్కడ గమనార్హం. అంటే ఆ సంస్థకు దేవి దాదాపు ఆస్థాన సంగీత దర్శకుడి లాగా అయ్యారన్న మాట.
![]() |
![]() |