![]() |
![]() |

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నటుడిగా మారుతున్నారని టాలీవుడ్ టాక్. వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన ఘనత ఆయనది. ఒకప్పుడు మౌనమునిగా పేరుండేది. స్టేజి మీద రెండు మూడు ముక్కలు మాట్లాడటానికి విముఖత చూపించే ఆయన, తరువాత ఒక టీవీ షో చేశారు. త్వరలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారని సమాచారం.
రాఘవేంద్రరావు హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నదని సమాచారం. అయితే, రాఘవేంద్రుడిని ఎలా ఒప్పించారనేది ప్రస్తుతానికి ఎవరికీ అంతుచిక్కని రహస్యమే. ఆ సినిమాలో ఆయన సరసన ముగ్గురు హీరోయిన్లు రమ్యకృష్ణ, శ్రియ, త్రిష నటించనున్నారని టాక్. అయితే అగ్రిమెంట్ల మీద ఇంకా సంతకాలు చేయలేదట. రాఘవేంద్రరావు అంటే రమ్యకృష్ణ నో చెప్పే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే... ఆయన దర్శకత్వంలో బోలెడు హిట్ సినిమాలు చేశారు. మిగతా ఇద్దరూ ఆయన దర్శకత్వంలో సినిమాలు చేశారు. అయితే, ఆయన సరసన చేస్తారా? లేదా? అనేది చూడాలి.
![]() |
![]() |