![]() |
![]() |

నటుడు, రాజకీయ నాయకుడు విజయకాంత్ కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చెన్నైలోని ఎంఐఓటీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా ఆయన కొవిడ్ నుంచి కోలుకున్నారనీ, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారనీ ఆయన పార్టీ డీఎండీకే వర్గాలు తెలిపాయి. విజయకాంత్ కరోనా వైరస్ బారిన పడ్డారనీ, దాంతో ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరారనీ బుధవారం సాయంత్రం వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలియగానే అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో ప్రార్థనలు చేస్తూ వస్తున్నారు.
ఈరోజు, డీఎండీకే పార్టీ ఓ అధికారిక ప్రకటన వెలువరిస్తూ, కొవిడ్-19 నుంచి విజయకాంత్ కోలుకున్నారని తెలిపింది. ఆ ప్రకటన ప్రకారం, జనరల్ చెకప్ కోసం విజయకాంత్ ఇటీవల ఎంఐఓటీ హాస్పిటల్‌కు వెళ్లారు. ఆయనకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేశారు. అందులో ఆయనకు కొవిడ్-19 సోకినట్లు వెల్లడైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడింది. త్వరలోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అవుతారు.
![]() |
![]() |