![]() |
![]() |

ఆటపాటలు అందచందాలతో మాత్రమే కాదు... తన జిమ్నాస్టిక్ ఫీట్ తోనూ ప్రేక్షకులను 'ఔరా... ఔరా' అని క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి అనిపించారు. తరచూ తనకు నచ్చిన పాటలకు డాన్సు చేస్తూ, ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఆమెకు అలవాటు. అయితే... డాన్స్ మాత్రమే కాదు, తరచు ఆమె వ్యాయామాలు కూడా చేస్తుంటారు. ఆర్టిస్టులకు ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్. అందుకని తప్పదు మరి. ఏవో చిన్నచిన్న వర్కౌట్స్ కాదు, వెయిట్ లిఫ్టింగ్ చేసి ప్రగతి ఔరా అనిపించారు. మహిళలు సైతం మగవారితో సమానంగా వర్కౌట్స్ చేయగలరని నిరూపించారు.
ప్రగతి డాన్స్ వీడియోస్ కి అప్పుడప్పుడు నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. ఆ మధ్య బొంబాయి సినిమాలో అమ్మ అమ్మ పాట కు ఆమె డాన్స్ చేయగా... 'మీకు ఈ యాంగిల్ అంత అవసరమా?' అని ఒకరు కామెంట్ చేశారు. అందుకు ప్రగతి ఘాటుగానే బదులిచ్చారు.
![]() |
![]() |