![]() |
![]() |
.jpg)
'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'ఎక్స్‌ప్రెస్ రాజా' సినిమాల దర్శకుడు మేర్లపాక గాంధీ ఉన్నారు కదా! ఆయన ఓ కథ రాశారు. మాంచి రొమాంటిక్ కామెడీ స్క్రిప్ట్ అట. అయితే, ఆ కథను ఆయన డైరెక్ట్ చేయడం లేదు. కార్తీక్ అనే కుర్రాడి చేతిలో పెట్టి, అతడిని డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ సినిమాలో సంతోష్ శోభన్ హీరోగా యాక్ట్ చేయనున్నాడు. అతడి పక్కన హీరోయిన్‌గా స్టెఫీ పటేల్‌ను సెలెక్ట్ చేశారు. తెలుగులో ఆమెకు రెండో సినిమా ఇది. ఇంతకు ముందు 'నిన్ను తలచి' సినిమాలో నటించారు. మిస్ టీన్ ఇంటర్నేషనల్‌గా 2016లో నిలిచిన స్టెఫీ పటేల్, ఈ టీనేజ్ లవ్ స్టోరీకి పర్ఫెక్ట్ సెలక్షన్ అని యూనిట్ భావిస్తోంది. అలా గాంధీ రచనలో పటేల్‌కి యాక్ట్ చేసే ఛాన్స్ దక్కింది.
లాక్‌డౌన్‌లో ఈ సినిమా కథ రాశానని మేర్లపాక గాంధీ తెలిపారు. ఇదొక వినోదాత్మక ప్రేమకథ అని, ఇందులో పాత్రలు అన్నీ కళ్ల ముందు కదులుతున్నట్టు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. న్యూ-ఏజ్ ఎంటర్టైనర్ అని చెప్పుకొచ్చారు. త్వరలో సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందట.
![]() |
![]() |