![]() |
![]() |

"లాక్‌డౌన్‌లో నండూరి రామ్మోహనరావు గారు రాసిన 'విశ్వదర్శనం' పుస్తకం చదివాను. 6వ తరగతి నుండి నాతో చదువుకున్న ముస్లిమ్ స్నేహితుడి సహాయంతో పవిత్ర గ్రంధం ఖురాన్ అధ్యాయనం చేశా. అందులో ఏముంది? మహ్మద్ ప్రవక్త ఏం చెప్పారు? అనేవి తెలుసుకున్నాను. బైబిల్‌లోని ఓల్డ్, న్యూ టెస్ట్‌మెంట్స్ తెలుసుకున్నాను" అని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తెలిపారు. త్వరలో ఆయనో టీవీ సీరియల్‌లో యాక్ట్ చేయనున్నట్టు వచ్చిన వార్తలను ఖండించారు. టీవీ సీరియల్స్, షోస్ చేసే ఆలోచన తనకు లేదని స్పష్టం ఆయన చేశారు.

పుస్తకాలు చదవడంతో పాటు తనకు బొమ్మలు గీయడం ఇష్టమనీ, లాక్‌డౌన్ కాలాన్ని చక్కటి బొమ్మలు వేయడానికి ఉపయోగిస్తున్నాననీ బ్రహ్మానందం తెలిపారు. ప్రస్తుతం ఇంట్లో హ్యాపీగా ఉన్నానని చెప్పారు. మనవడు పార్థ చేసే అల్లరితో అసలు సమయమే తెలియడం లేదన్నారు. తమ ఇంట్లో అందరికీ మనవడు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడని తెలిపారు.
![]() |
![]() |