Home  »  News  »  తమన్నా లిస్ట్ లో మంచు విష్ణు ఉంటాడా!

Updated : Apr 29, 2024

మంచు వారి ప్రెస్టేజియస్ట్ మూవీ కన్నప్ప. మంచు విష్ణు టైటిల్ రోల్ ని పోషిస్తున్నాడు.  విష్ణు  ఇప్పటి వరకు సోషల్ ఎలిమెంట్ చిత్రాల్లో మాత్రమే నటించాడు. దీంతో  కన్నప్ప గా ఎలా నటిస్తాడో అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

కన్నప్పలో ఒక ప్రత్యేక గీతం ఉంది.  కథకి అది  చాలా ముఖ్యమైనది కూడా.  ఆ  సాంగ్ ని ఎలాగైనా  తమన్నా చేత చేయించాలని మేకర్స్  ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. ఈ మేరకు త్వరలోనే  తమన్నా ని  కలవబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఈ విషయం మీద ఇంకా అధికార ప్రకటన రాలేదు. ఒక వేళ అదే నిజమయ్యి  తమన్నా  గ్రీన్ సిగ్నల్ ఇస్తే కన్నప్ప కి అదనపు ఆకర్షణ కూడా తోడయినట్టే. పైగా తమన్నాకి పీరియాడిక్ అండ్ చారిత్రాత్మక సినిమాల్లో నటించిన అనుభవం కూడా ఉంది. హావ భావాలని, బాడీ లాంగ్వేజ్ ని పర్ఫెక్ట్ గా పండించగలదు. బహుబలి,సైరా నరసింహ రెడ్డిలే   అందుకు ఉదాహరణ

 పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న కన్నప్ప లో  మోహన్ బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రభాస్, నయనతార, మోహ‌న్ లాల్ ,అక్షయ్ కుమార్ , శరత్ కుమార్  వంటి వారు నటిస్తున్నారనే వార్త ఎప్పటినుంచో  వినపడుతుంది.ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫిలిం ఫ్యాక్టరీ అండ్ అవా ఎంటర్టైన్మెంట్స్ పై విష్ణు,మోహన్ బాబు లే  నిర్మిస్తున్నారు. ప్రీతీ ముకుందన్ కథానాయిక  కాగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకుడు.  పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. 100 కోట్ల బడ్జట్ అని అంచనా

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.