![]() |
![]() |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)తమన్నా(Tamannaah)జంటగా రెబల్, బాహుబలి పార్ట్ 1 ,పార్ట్ 2 లాంటి చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా బాహుబలి సిరీస్ లో ఆ ఇద్దరి ఫెయిర్ అభిమానులతో పాటు ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. మళ్ళీ ఆ ఇద్దరు కలిసి ఎటువంటి చిత్రంలో కనిపించలేదు.
ప్రభాస్ అప్ కమింగ్ మూవీ 'ది రాజాసాబ్'(The Rajasaab)డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీలోని ఒక స్పెషల్ సాంగ్ ని మేకర్స్ డిజైన్ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి చిత్ర బృందం కొంత మంది నటీమణుల పేర్లు ప్రస్తావిస్తుంది. ఇందుకు సంబంధించి కొంత మంది పేర్లు కూడా బయటకి వచ్చాయి. రీసెంట్ గా ఆ స్పెషల్ సాంగ్ లో తమన్నా
కనపడే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మేకర్స్ తమన్నాని సంప్రదించారని,ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ఈ విషయంపై త్వరలోనే అధికార ప్రకటన వచ్చే
అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మరో సారి ప్రభాస్, తమన్నాని సిల్వర్ స్క్రీన్ పై చూడాలని అభిమానులు కోరుతున్నారు.
తమన్నా గత కొంత కాలం నుంచి హీరోయిన్ గా చేస్తూనే స్పెషల్ సాంగ్స్ లోను తన సత్తా చాటుతుంది. పైగా సదరు సాంగ్ వలన ఆయా చిత్రాలకి స్పెషల్ క్రేజ్ కూడా వస్తుంది. 'జైలర్' లోని నువ్వు కావాలయ్యా సాంగ్, గత ఏడాది ఆగస్టులో వచ్చిన 'స్త్రీ 2 ' లోని ఆజ్ కీ రాత్ సాంగ్ లే అందుకు ఉదాహరణ.
.webp)
![]() |
![]() |