![]() |
![]() |
సీనియర్ నటుడు ఈశ్వరరావు కన్ను మూశారు. మిచిగాన్‌లోని తన కూతురు ఇంటికి వెళ్లిన ఆయన అనారోగ్య కారణంగా మృతి చెందారు.. మురళీమోహన్ , మోహన్ బాబు , చిరంజీవి కి సమకాలిక నటులు.. ఆ తరం నటులు అందరి తోనూ కలిసినటించారు.. హీరోగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎక్కువకాలం మూవీస్ లో నటించారు. ఈశ్వర రావు అసలు పేరు విశ్వస్వరరావు.. కాలేజీ చదివే రోజుల్లో నటనమీద వుండే మక్కువతో నాటకాలలో నటించేవారు
దర్శకరత్న డా॥ దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన సూపర్‌హిట్ మూవీ ‘స్వర్గం నరకం’ చిత్రంతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఈశ్వరరావు నటుడిగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. బొమ్మరిల్లు, మంచిని పెంచాలి, ఈకాలం కథ, సంగీత, శభాష్ గోపి, కన్నవారిల్లు, తల్లి దీవెన వంటి సినిమాల్లో హీరోగా నటించారు. 1975లో చిత్ర పరిశ్రమలోకి వచ్చిన ఈశ్వరరావు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సహజ సిద్ధమైన నటనతో దాదాపు 250కి పైగా చిత్రాల్లో నటించారు. ఈశ్వరరావు గారి భార్యపేరు వసుంధరాదేవి.. వీరికి ఇద్దరు పిల్లలు..కొడుకు కూతురు. కొడుకుపేరు చంద్ర ఆదిత్య కూతురుపేరు లావణ్య..
కూతురు లావణ్య దగ్గర కొన్ని రోజులు గడిపిరావటాని కి వెళ్లిన ఈశ్వరరావు గారు అనారోగ్యం కారణంగా అక్టోబర్ 31 న మరణించారు... కొంతకాలంగా ఇండస్ట్రీ కి దూరంగా ఉంటున్న కారణంగా కాస్త ఆలస్యం గా ఈశ్వరరావు గారి మరణవార్త వెలుగులోకి వచ్చింది.. ఈ వార్త తెలుసుకున్న సినిమా పరిశ్రకు చెందిన నటి నటులు సాంకేతికనిపుణులు ఈశ్వరరావు కి సంతాపం తెలియచేస్తున్నారు.
![]() |
![]() |