Home  »  News  »  Sreeleela: షూటింగ్ టైంలో పీరియడ్స్‌తో శ్రీలీల ఇబ్బంది! షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన హీరోయిన్ 

Updated : Apr 7, 2026

 

 

ఉస్తాద్ తో మెప్పించిన శ్రీలీల
డాన్స్ ల విషయం తెలిసిందే 
రీసెంట్ గా పీరియడ్స్ పై స్పందించిన హీరోయిన్ 


శ్రీలీల(Sreeleela)గత నెల మిడిల్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan)తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ లో కనిపించి మెప్పించిన విషయం తెలిసిందే. స్క్రీన్ పై తాను కనిపిస్తున్నంత సేపు ఉస్తాద్ కి జోష్ ని ఇవ్వడమే కాకుండా ప్రేక్షకులకి  సదరు జోష్ ని అందించడంలో భారీగానే సక్సెస్ అయ్యింది. శ్రీలీల రీసెంట్ గా ఒక కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యింది. అందులో ఆమె మహిళలకి సహజ సిద్ధంగా వచ్చే పీరియడ్స్ గురించి మాట్లాడటం జరిగింది. ఆ మాటలేంటో చూద్దాం.  

 పీరియడ్స్ అనేవి సాకుగా ఉండకూడదనేది నా అభిప్రాయం. నేను ఇప్పటివరకు చాలా సాంగ్స్ కి  డ్యాన్స్ చేశాను. వాటిల్లో హిట్ సాంగ్స్ అన్నీ దాదాపు పీరియడ్స్ టైంలో   చేసినవే. ఆ సాంగ్స్ లోని నా స్టెప్స్ కి మంచి ప్రశంసలు వచ్చాయి. మనం మన శారీరక, మానసిక సమస్యలన్నింటినీ అధిగమించి ముందుకు సాగాలి. పురుషులతో సమానంగా సమాన అవకాశాలు, సమాన అధికారం, సమాన హక్కులు కోరుతున్నప్పుడు, మన నెలసరిని ఒక సాకుగా చూపి ఎలా వెనక్కిపోగలమని చెప్పుకొచ్చింది. పీరియడ్స్‌ వలన    షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా అని ఒక విలేకరి అడగడంతోనే శ్రీలీల ఆ విధంగా చెప్పుకొచ్చింది.


Also Read: Balakrishna: అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని.. నోట్ రిలీజ్ చేసిన బాలకృష్ణ 


ఇక అభిమానులైతే శ్రీలీలకి మంచి పేరు తీసుకొచ్చిన సాంగ్స్ ని చూసే పనిలో బిజీగా ఉన్నారు. వైద్యురాలు కూడా అయిన శ్రీలీల నుంచి ఇంకా కొత్త సినిమా ప్రకటన రాలేదు.

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.