Home  »  News  »  శ్రీలీలని వెంటాడుతున్న దురదృష్టం.. వైఫే లా ఉండదు కదా!

Updated : Aug 18, 2026

 

 

బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అవుతాయనే సామెత శ్రీలీల ప్రస్తుత సినీ  కెరీర్ విషయంలో నిజం కాబోతుందా అనే గుసగుసలు సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. శ్రీలీలపై ఎవరకి వ్యకిగత ద్వేషాలు లేవు. ఆమె సినీ ట్రాక్ ని బట్టే బళ్ళు, ఓడలు సామెత వినిపిస్తుంది.   

టాలీవుడ్‌లో ఒకానొక సమయంలో వరుస ఆఫర్స్ తో  సంచలనంగా మారిన డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల కెరీర్ ఇప్పుడు గడ్డు పరిస్థితిని  ఎదుర్కొంటోంది. ఒక్క ఏడాదిలోనే వరుసగా దాదాపు 9 సినిమాల్లో నటించి ఇండస్ట్రీ చూపునంతా తనవైపు తిప్పుకున్న ఈ భామ, అనుకోని రీతిలో అవకాశాలు తగ్గిపోవడంతో ఇబ్బందికర పరిస్థితుల్లో పడింది. ఒకప్పుడు రోజుకు రెండు కాల్షీట్లు ఇస్తూ క్షణం తీరిక లేకుండా గడిపిన ఈ ముద్దుగుమ్మకు, ప్రస్తుతం తెలుగులో కొత్త ప్రాజెక్ట్‌లు ఏవీ రాకపోవడం ఫ్యాన్స్‌ని   కలవరపెడుతోంది. పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' పైనే ఈ బ్యూటీ కొండంత ఆశలు పెట్టుకుంది. అయితే ఆ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరచడంతో టాలీవుడ్ మేకర్స్ ఆమెను పూర్తిగా పక్కన పెట్టేశారు. అసలు శ్రీలీల అనే హీరోయిన్ ఉన్న సంగతినే టాలీవుడ్ పరిశ్రమ మర్చిపోయిందనే వార్తలు ట్రేడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు తగ్గడంతో శ్రీలీల తన దృష్టిని కోలీవుడ్‌ వైపు మళ్లించింది. తమిళంలో శివకార్తికేయన్ సరసన బిగ్ ప్రాజెక్ట్ 'పరాశక్తి' మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా మిగిలిపోయింది. అయినప్పటికీ, ధనుష్ సరసన భారీ అంచనాలతో తెరకెక్కుతున్న 'ఓం చాప్టర్ 1' లో శ్రీలీలకు ఓ కీలక పాత్ర దక్కింది. అయితే ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ సాయి పల్లవి కూడా నటించబోతుండటంతో, శ్రీలీల పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది? అది ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.


Also read: ధ్రువ్ విక్రమ్ ఘాటు వ్యాఖ్యలు.. అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ కామెంట్స్‌పై రియాక్షన్ ఇదే


మరోవైపు బాలీవుడ్‌లో కార్తిక్ ఆర్యన్, ఇబ్రహీం అలీ ఖాన్ వంటి క్రేజీ స్టార్ల సరసన బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ బిజీ అవుదామని భావించినా, ఆ చిత్రాల  విడుదలపై క్లారిటీ రావడం లేదు.కార్తీక్ ఆర్యన్ మూవీ అయితే రీ షూట్స్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నట్టుగా కూడా టాక్ నడుస్తుంది. మరి శ్రీలీలకి వరుస ఫ్లాప్‌లు,  క్యారెక్టర్స్ లో వైవిధ్యం లేకపోవడం వల్ల ఆఫర్లు తగ్గాయా లేదా తన MBBS మెడికల్ చదువుపై ఫోకస్ పెట్టడం కోసమే సినిమాలకు గ్యాప్ ఇచ్చిందా అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఏదేమైనా శ్రీలీల తన సెకండ్ ఇన్నింగ్స్‌లో సరైన కథలను ఎంచుకుని, క్రేజీ ప్రాజెక్ట్‌లతో మళ్లీ కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. అప్పటి దాకా బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అయ్యాయా అనే సామెత సినీ సర్కిల్స్ లో రన్ అవుతూనే ఉంటుంది.

Sreeleela, kartik Aaryan, Pawan kalyan


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.