![]() |
![]() |

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన 'కొరియన్ కనకరాజు' తాజాగా విడుదలైంది. అయితే ఇందులో సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ఒకటి ఉపయోగించడం కాంట్రవర్సీకి కారణమైంది.
'యుగపురుషుడు' సినిమాలో 'మీ స్ట్రోక్స్ చాలా అమెచ్యూరిష్ గా ఉన్నాయి" అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలు మీమ్స్ లో ఆ డైలాగ్ దర్శనమిస్తోంది.
అయితే 'కొరియన్ కనకరాజు' సినిమాలో ఇదే డైలాగ్ ను.. కమెడియన్ సత్య 'ఎన్టీఆర్'ను ఇమిటేట్ చేస్తూ చెప్పాడు.
రీసెంట్ గా వైరల్ అయిన ఈ డైలాగ్ ను.. ఎప్పుడో షూటింగ్ అయిపోయిన మూవీలో ఎలా పెట్టారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఆ డైలాగ్ ను సినిమాలో వాడారు కాబట్టే.. ప్లానింగ్ ప్రకారం కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయిస్తున్నారు? అని నందమూరి ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మూవీ టీంపై ఫైర్ కూడా అవుతున్నారు.
మరి దీనిపై 'కొరియన్ కనకరాజు' మూవీ టీం ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.
Korean Kanakaraju, NTR Amateurish Dialogue, Varun Tej, Comedian Satya
![]() |
![]() |