![]() |
![]() |

ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి లక్ష్మీ కళ్యాణి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం రాత్రి చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా సింగీతం తెలియజేశారు.
'నా భార్య లక్ష్మీ కళ్యాణి శనివారం రాత్రి 9 గంటల 10 నిమిషాలకు తుదిశ్వాస విడిచింది. 62 ఏళ్ల మా సుదీర్ఘ భాగస్వామ్యానికి ముగింపు పడింది' అంటూ సోషల్ మీడియా ద్వారా సింగీతం తన బాధని పంచుకున్నారు. 1960లో సింగీతం, లక్ష్మీ కళ్యాణిల వివాహం జరిగింది. సింగీతం సీనీ కెరీర్‌లో లక్ష్మీ కల్యాణి కీలక పాత్ర పోషించారు. స్క్రిప్ట్ రాయటంలో సింగీతంకు ఆమె తన వంతు సాయం చేసేవారు. సింగీతం తన సతీమణి గురించి తెలియజేస్తూ 'శ్రీకల్యాణీయం' అనే పుస్తకాన్ని కూడా రాశారు.
'మయూరి', 'పుష్పక విమానం', 'భైరవ ద్వీపం', 'ఆదిత్య 369' వంటి ఎన్నో క్లాసిక్ సినిమాలకు దర్శకత్వం వహించిన సింగీతం.. వయసు రీత్యా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఆయన వయస్సు 90 సంవత్సరాలు.
![]() |
![]() |