![]() |
![]() |

సినీ సెలబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల కమల్ హాసన్, కరీనా కపూర్, మంచు మనోజ్, అర్జున్ కపూర్, నోరా ఫతేహి ఇలా ఎందరో కరోనా బారిన పడగా.. తాజాగా మరో బాలీవుడ్ భామ తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది. గత నాలుగు రోజులుగా కరోనాతో పోరాడుతున్నట్లుగా ఆమె తెలియజేసింది. "ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి, దయచేసి వ్యాక్సిన్ వేసుకోని, అన్ని నియమాలను పాటించండి" అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కి నమ్రతా స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించింది. కాగా శిల్పా ప్రస్తుతం దుబాయ్ లో నివసిస్తోంది.
ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ సెలబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడటం అభిమానవుల్లో ఆందోళన కలిగిస్తోంది. వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
![]() |
![]() |