Home  »  News  »  'భీమ్లా నాయక్'కి పోటీగా మరో యంగ్ హీరో!

Updated : Feb 2, 2022

'రాజావారు రాణిగారు' సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం మొదటి సినిమాతోనే ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన 'ఎస్ఆర్ కల్యాణమండపం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో చేతిలో ప్రస్తుతం పలు సినిమాలు ఉన్నాయి. అందులో 'సెబాస్టియ‌న్ P.C. 524' సినిమా ఒకటి. అయితే ఈ సినిమాని పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' కి పోటీగా విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు ఈ యంగ్ హీరో.

'భీమ్లా నాయక్' సినిమాని ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1 న రిలీజ్ చేస్తామని రీసెంట్ గా మేకర్స్ ప్రకటించారు. అయితే భీమ్లా నాయక్ విడుదలపై ఇంకా క్లారిటీ రాకుండానే ఫిబ్రవరి 25 కి తమ సినిమాలని రిలీజ్ చేయడానికి యంగ్ హీరోలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే శర్వానంద్ 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమాతో ఫిబ్రవరి 25 న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు అదే డేట్ కి కిరణ్ అబ్బవరం కూడా రానున్నాడు. 'సెబాస్టియ‌న్' సినిమాని ఫిబ్రవరి 25 న విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఒకవేళ 'భీమ్లా నాయక్' ఫిబ్రవరి 25 నే విడుదలైతే ఈ యంగ్ హీరోలు పవర్ స్టార్ ప్రభంజనంలో కూడా సత్తా చాటుతారేమో చూడాలి.

ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన 'సెబాస్టియ‌న్'కి బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించగా.. ఘిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.