Home

»

Latest News

కొరటాల సమర్పణలో 'కృష్ణమ్మ'

Jul 3, 2022 6:14PM

వరుస సినిమాలతో అలరించే యంగ్ హీరో సత్యదేవ్ మరో సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం.

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన 'జవాన్' సినిమాతో ప్రొడక్షన్ లోకి అడుగు పెట్టిన అరుణాచల క్రియేషన్స్.. తమ బ్యానర్ లో రెండో సినిమాని సత్యదేవ్ తో చేస్తున్నట్లు గతేడాది జులైలో ప్రకటించింది. ఏడాది తర్వాత తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది.

రేపు(జులై 4) సత్యదేవ్ పుట్టినరోజు కావడంతో తాజాగా ఈ మూవీ టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. వీవీ గోపాల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి 'కృష్ణమ్మ' అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. పోస్టర్ లో నదీతీరాన నెత్తుటి కత్తిని పట్టుకొని ఉన్న సత్యదేవ్ లుక్ ఆకట్టుకుంటోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com