![]() |
![]() |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్ లో ప్రకటించిన 'స్పిరిట్' (Spirit) మూవీ ఎప్పుడు మొదలవుతుందా అని ప్రభాస్ అభిమానులతో పాటు, సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కేవలం అనౌన్స్ మెంట్ తోనే ఈ రేంజ్ అంచనాలు ఏర్పడిన సినిమా ఇదేనని చెప్పవచ్చు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి సందీప్ రెడ్డి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు.
ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'రాజా సాబ్', హను రాఘవపూడి డైరెక్షన్ లో 'ఫౌజీ' సినిమాలు చేస్తున్నాడు. అలాగే 'కల్కి-2', 'సలార్-2' ప్రాజెక్ట్ లు కూడా చేతిలో ఉన్నాయి. దీంతో 'స్పిరిట్' ఎప్పుడు మొదలవుతుందో తెలుసుకోవడం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సందీప్ రెడ్డి ఓ క్రేజీ న్యూస్ చెప్పాడు.
రీసెంట్ గా ఓ ఈవెంట్ లో పాల్గొన్న సందీప్ తన తదుపరి చిత్రాల గురించి మాట్లాడుతూ.. తన నెక్స్ట్ రెండు సినిమాలు 'స్పిరిట్', 'యానిమల్ పార్క్' అని, వీటి కోసమే నెక్స్ట్ నాలుగేళ్లు కేటాయించనున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం 'స్పిరిట్' ప్రీ ప్రొడక్షన్ దశలో ఉందని, రెండేళ్లలో ఈ సినిమా విడుదలవుతుందని చెప్పాడు. ఆ తర్వాత 'యానిమల్ పార్క్' మూవీ వర్క్ స్టార్ట్ అవుతుందని అన్నాడు. ఈ రెండు సినిమాల కోసం తాను నాలుగేళ్లు కేటాయిస్తానని, అప్పటివరకు ఇతర సినిమాల జోలికి పోనని సందీప్ చెప్పుకొచ్చాడు.
నిజానికి అల్లు అర్జున్ (Allu Arjun) తో కూడా సందీప్ ఒక సినిమా చేయాల్సి ఉంది. టీ సిరీస్ నిర్మించనున్న ఈ మూవీ ప్రకటన గతేడాదే వచ్చింది. అయితే సందీప్ తాజా కామెంట్స్ ని బట్టి చూస్తే.. నాలుగేళ్ళ దాకా ఈ సినిమా గురించి ఊసే ఉండకపోవచ్చు. ఇక నాలుగేళ్ళ తర్వాత అంటే.. అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చెప్పలేము.
'పుష్ప'తో పాన్ ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ఇదే ఫ్లోలో సందీప్ లాంటి డైరెక్టర్ తో మంచి ఫిల్మ్ పడితే.. ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అందుకే సందీప్ తో సినిమా ఉండాలని బన్నీ ఫ్యాన్స్ ఎందరో కోరుకున్నారు. కానీ సందీప్ మాటలను బట్టి చూస్తే.. ఇప్పట్లో ఆ ప్రాజెక్ట్ ఉండే అవకాశం కనిపించడంలేదు.
![]() |
![]() |