Home  »  News  »  Samantha: ‘మా ఇంటి బంగారం’ రెస్పాన్స్.. సమంత సంచలన ట్వీట్!

Updated : Jun 20, 2026

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) లీడ్ రోల్‌లో నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaaram) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. రాజ్ నిడిమోరు క్రియేట్ చేసిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకురాలు బి.వి. నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్‌ బ్యానర్‌పై సమంత స్వయంగా నిర్మించిన ఈ చిత్రం మొదటి రోజే ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ అందుకోవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇందుకు సంబంధించిన అధికారిక కలెక్షన్ల పోస్టర్ ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రకారం 'మా ఇంటి బంగారం' చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 13.15 కోట్ల రూపాయల భారీ గ్రాస్ వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకి ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

ఈ అద్భుతమైన విజయంపై స్పందిస్తూ సమంత తన అఫీషియల్ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక సుదీర్ఘమైన ఎమోషనల్ నోట్‌ను షేర్ చేశారు. మొదటి రోజు ఇంతటి ఘనవిజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సినిమా హీరో ఆధారితమా లేదా హీరోయిన్ ఆధారితమా అనే తేడా లేకుండా, కేవలం కంటెంట్‌ను నమ్మి థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందన్నారు. చిన్న పిల్లల నుండి ముసలివారి వరకు ప్రతి ఒక్కరూ థియేటర్లలో ఈ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని పేర్కొన్నారు.

ముఖ్యంగా థియేట్రికల్ ఓపెనింగ్స్ అనేవి కేవలం మేల్ ఆడియన్స్ వల్లే సాధ్యమవుతాయనే పాత నమ్మకాన్ని బ్రేక్ చేస్తూ, ఈ చిత్రానికి మొదటి రోజు మహిళా ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలిరావడం సినిమా పరిశ్రమ ఎదుగుదలకు నిదర్శనమని సమంత సంతోషం వ్యక్తం చేశారు. తమ చిన్న ప్రొడక్షన్ హౌస్ 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్' నమ్మిన సిద్ధాంతాన్ని నిలబెట్టుకుంటూ మొదటి రోజే ఒక బ్లాక్‌బస్టర్ హిట్‌ను డెలివరీ చేసిందని ఆమె ఎంతో ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

 

https://x.com/Samanthaprabhu2/status/2068213638335533219






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.