![]() |
![]() |

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaaram) విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టిస్తోంది. జూన్ 19న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం, రిలీజ్‌కు ముందే పెట్టిన పెట్టుబడిని పూర్తిగా రికవరీ చేసుకొని ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా విడుదలకు ముందే పూర్తి సేఫ్ జోన్‌లోకి రావడం ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక అరుదైన రికార్డుగా నిలిచింది.
సినీ ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. 'మా ఇంటి బంగారం' సినిమాను దాదాపు రూ. 25 కోట్ల నుంచి రూ. 30 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే ఈ సినిమా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులకు మార్కెట్లో ఊహించని స్థాయిలో భారీ డిమాండ్ ఏర్పడింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, శాటిలైట్ ఛానెల్స్ ఈ సినిమా రైట్స్ కోసం పోటీ పడ్డాయి. ఫలితంగా అన్ని రకాల బిజినెస్ డీల్స్ చాలా విజయవంతంగా క్లోజ్ అయిపోయాయి. ఈ విక్రయాల ద్వారా సినిమా ప్రీ-రిలీజ్ స్టేజ్ లోనే పెట్టిన పెట్టుబడిని వెనక్కి రాబట్టడమే కాకుండా మేకర్స్ ను లాభాల బాట పట్టించింది.
ప్రస్తుత సినిమా మార్కెట్ పరిస్థితుల్లో ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకి ఈ స్థాయి బిజినెస్ జరగడం, రిలీజ్ కాకుండానే ప్రాఫిట్స్ జోన్ లోకి వెళ్లడం మామూలు విషయం కాదు.
'మా ఇంటి బంగారం' సినిమాకి సమంతనే నిర్మాత కావడం విశేషం. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 'ఓ బేబీ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సమంత-నందిని రెడ్డి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో 'మా ఇంటి బంగారం'పై మంచి అంచనాలు ఉన్నాయి.
2023లో విజయ్ దేవరకొండ సరసన నటించిన 'ఖుషి' చిత్రం తర్వాత సమంత పూర్తిస్థాయిలో లీడ్ రోల్ లో వెండితెరపై కనిపించనున్న థియేట్రికల్ మూవీ ఇదే కావడం గమనార్హం. మధ్యలో 2024లో వరుణ్ ధావన్‌తో కలిసి 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్‌తో డిజిటల్ అలరించిన ఆమె, 2025లో తన సొంత నిర్మాణ సంస్థలో వచ్చిన 'శుభం' చిత్రంలో కేవలం ఒక చిన్న అతిథి పాత్రలో మాత్రమే మెరిశారు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత సమంత థియేటర్లలో లీడ్ రోల్ లో మెరవబోతున్న ప్రాజెక్ట్ కావడంతో ఇటు అభిమానుల్లోనూ, అటు సాధారణ ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రీ-రిలీజ్ బిజినెస్ తోనే సంచలనం రేపిన ఈ 'బంగారం' థియేటర్లలో ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలి.
![]() |
![]() |