![]() |
![]() |

ప్రముఖ హీరో విశాల్ (Vishal) ప్రస్తుతం ‘మకుటం’ (Makutam) చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ మూవీతో విశాల్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. రవి అరుసు కథను అందించారు. విశాల్ 35వ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ఈ ‘మకుటం’ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తోంది. విశాల్ సరసన ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ నటిస్తున్నారు. ఇప్పటి వరకు ‘మకుటం’ నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ అన్నీ కూడా ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి.
విశాల్ ఈ చిత్రంలో మూడు డిఫరెంట్ లుక్స్, షేడ్స్‌లో కనిపించబోతోన్నారు. విశాల్ ఈ సినిమాలో లింగా అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతోన్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘రైజ్ ఆఫ్ లింగా’ (Rise Of Linga) అనే పాటను విడుదల చేశారు. ఈ పాటను చూస్తుంటే సినిమాలో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతోన్నట్టుగా తెలుస్తోంది. ‘రైజ్ ఆఫ్ లింగా’ పాటని విశాల్, జీవీ ప్రకాష్ సంయుక్తంగా ఆలపించారు. ఇక ఈ పాట ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్‌గా రికార్డులు క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. జూలైలో మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేస్తోంది.
‘మకుటం’ మూవీకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. దురైరాజ్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
![]() |
![]() |