Home  »  News  »  Repu Udayam 10 Gantalaku Review: 'రేపు ఉదయం 10 గంటలకు' మూవీ రివ్యూ.. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోయింది!

Updated : Mar 29, 2026

టాలీవుడ్‌లో ఇటీవల చిన్న సినిమాలు వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఆ కోవలోకే వస్తుంది 'రేపు ఉదయం 10 గంటలకు'. చైతన్య రావు, హెబ్బా పటేల్, అభినవ్ గోమఠం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం థియేటర్లలో కంటే ఓటీటీ వేదికగా ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. 'ఓ పిట్టకథ', 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో' సినిమాల దర్శకుడు చందు ముద్దు ఒక క్రైమ్ మిస్టరీని డైరెక్ట్ చేయడం విశేషం. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. (Repu Udayam 10 Gantalaku Movie Review)

కథ:
ఈ సినిమా టైటిల్ సూచించినట్లుగానే కథ మొత్తం మరుసటి రోజు ఉదయం 10 గంటల లోపు జరగబోయే పరిణామాల చుట్టూ తిరుగుతుంది. సినిమా ప్రారంభంలోనే ఒక వ్యక్తి మరణంతో కథ మొదలవుతుంది. అంబులెన్స్ డ్రైవర్ మల్లేశం(అభినవ్ గోమఠం) ఒక డెడ్ బాడీని తీసుకుని హైదరాబాద్ నుంచి కాకినాడ బయల్దేరతాడు. ఆ మరణం వెనుక ఉన్న కారణాలేంటి? అసలు ఆ వ్యక్తి ఎవరు? అనే ప్రశ్నలతో ప్రేక్షుకుల్లో ఆసక్తి రేకెత్తుతుంది. మరోవైపు, పెళ్లికి సిద్ధమవుతున్న ఒక యువకుడు (చైతన్య రావు) తన కోరిక తీర్చుకోవడానికి ఒక వేశ్య (హెబ్బా పటేల్) దగ్గరకు వెళ్లడం, అక్కడ ఎదురయ్యే వింత పరిస్థితులు కథను మలుపు తిప్పుతాయి. వీరందరి జీవితాల్లో మరుసటి రోజు ఉదయం 10 గంటల సమయం అత్యంత కీలకం కాబోతోంది. ఆ గడువు లోపు ఏం జరిగింది? అసలు విలన్ ఎవరు? అనేదే మిగిలిన కథ.

విశ్లేషణ:
నిజానికి ఇదొక మల్టీ-లీనియర్ కథాంశం. వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారందరూ ఒకే మలుపు వద్ద ఎలా కలిశారు అనేది ఆసక్తికరం. సినిమాలో క్రైమ్ ఎలిమెంట్స్‌తో పాటు అభినవ్ గోమఠం తనదైన శైలిలో కామెడీని పండించారు. స్క్రీన్‌ప్లేలో కొన్ని కన్ఫ్యూజన్ సీన్స్ ఉన్నప్పటికీ, క్లైమాక్స్ వరకు సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. డెడ్ లైన్ దగ్గర పడుతున్న కొద్దీ వచ్చే సీన్స్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. దర్శకుడు చెందు ముద్దు సినిమాను రన్ చేసిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.

దర్శకుడు చెందు ముద్దు గతంలో ‘ఓ పిట్ట కథ’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాలో కూడా ఆయన మేకింగ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంది. స్క్రీన్ ప్లే విషయంలో కొత్తగా ప్రయత్నించాడు. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉండాల్సిన గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేను అందించేందుకు టీమ్ గట్టిగానే శ్రమించింది. కథలో మలుపులు, పాత్రల మధ్య ఉన్న కామన్ లింక్ రివీల్ అయ్యే విధానం బాగుంది. అయితే కొన్ని చోట్ల కన్ఫ్యూజన్ డ్రామా కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది.  

టెక్నికల్ గా చూస్తే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ సినిమా మూడ్‌కు తగ్గట్టుగా కుదిరాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. మ్యాంగో మాస్ మీడియా బ్యానర్‌పై రామకృష్ణ వీరపనేని ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో పెద్దగా ప్రమోషన్ లేకపోవడంతో జనాల్లోకి వెళ్లలేకపోయినా, ఓటీటీలో మాత్రం ఈ మిస్టరీ కథకు మంచి ఆదరణ లభిస్తోంది. సస్పెన్స్ మరియు కామెడీ మిక్స్ అయిన సినిమాలు ఇష్టపడే వారికి ఇది మంచి ఛాయిస్. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ అదిరింది. కొన్ని చోట్ల లాగ్ అనిపించినా ఈ సినిమా మెప్పించింది.

నటీనటుల పనితీరు:
చైతన్య రావు తన పాత్రలో ఒదిగిపోయారు. ఒక వైపు కన్ఫ్యూజన్, మరోవైపు భయం కలిగించే సన్నివేశాల్లో మంచి నటన కనబరిచాడు. హెబ్బా పటేల్ తన బోల్డ్ అండ్ ఇంపాక్ట్ ఫుల్ రోల్ తో మెప్పించింది. ఇక అభినవ్ గోమఠం తనదైన కామెడీ టైమింగ్‌తో అక్కడక్కడ నవ్వులు పూయించారు. కిరీటి దామరాజు, వాసు ఇంటూరి తమ పరిధి మేరకు నటించి కథకు బలాన్ని చేకూర్చారు. 

ఫైనల్ గా...
క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి 'రేపు ఉదయం 10 గంటలకు' ఒక మంచి ఆప్షన్. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఊహకందని విధంగా ఉంటుంది. కథలో కొన్ని లాజిక్స్ పక్కన పెడితే, ఈ వీకెండ్ ఓటీటీలో ఒక విభిన్నమైన సినిమా చూడాలనుకునే వారు దీన్ని ట్రై చేయవచ్చు. ముఖ్యంగా ఆ గడువు లోపు ఏం జరుగుతుందనే ఉత్కంఠ చివరి వరకు మిమ్మల్ని కుర్చీకి కట్టిపడేస్తుంది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.