Home

»

Latest News

రేణు దేశాయ్ కి ఫుడ్ పాయిజన్.. అందుకే వీడియో చెయ్యలేదు

May 16, 2024 2:26PM

పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్ రేణు దేశాయ్ కి అర్జెంటుగా మూడువేల ఐదు వందల రూపాయిలు కావాలి. ఆ పేరుతో ఎవరైనా అడుగుతున్నారేమో అని అనుకోవద్దు. నిజంగానే తనకే  ఆ డబ్బులు కావాలి. పైగా అడిగింది  నేనే అంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. అసలు ఆ మ్యాటర్  ఏంటో పూర్తిగా చూద్దాం

 కొన్ని రోజుల క్రితం మూడు వేల ఐదు వందలు రూపాయిలు కావాలని  కోరుతూ రేణు దేశాయ్ ఇన్‌స్టా ఖాతాలో ఓ మెసేజ్ పోస్టు అయ్యింది. క్యూఆర్ కోడ్ కూడా షేర్ అయ్యింది.దీంతో ఆమె అభిమానులు అయితే ఏమి పవన్ అభిమానులు అయితే ఏమి   అమౌంట్ ని  ట్రాన్స్‌ఫర్ చేశారు. కొంత మంది అభిమానులు మాత్రం రేణు దేశాయ్ అకౌంట్ హ్యాక్ అయ్యి ఉండచ్చనే   అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ అనుమానాలన్నింటిని పటా పంచలు చేస్తు రేణూ దేశాయ్ ఒక వీడియో  చేసింది. అమౌంట్ అడిగిన మాట నిజం. పిల్లలు,పెంపుడు జంతువులు, గోవుల కి సంబంధిచిన  దాతృత్వ కార్యక్రమాల గురించి డబ్బు అడిగినట్టు చెప్పింది. పైగా వాటి గురించి పూర్తి వివరణ కూడా ఇచ్చింది.

నేను రెగ్యులర్‌గా కొంత మొత్తాన్ని డొనేట్ చేస్తుంటాను.  నా సంపాదనలో కొంత భాగాన్ని అందుకు  కేటాయించాను. అయితే, అప్పుడప్పుడూ కాస్త ఎక్కువ మనీ  అవసరం ఏర్పడుతుంది. కాకపోతే నాకున్న  లిమిట్స్ వలన మనీ ఎగ్జస్మెంట్  అవ్వడం లేదు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా. అందువల్ల నా వరకు సాయం చేశాక ఇంకా బ్యాలెన్స్ కావాలంటే ఫాలోవర్స్‌ను అడుగుతున్నానని చెప్పకొచ్చింది. నిజానికి  ఇన్ స్టాలో  పోస్టు పెట్టిన రోజునే వీడియో సందేశం ఇద్దామని అనుకున్నాను. కానీ ఫుడ్ పాయిజన్ కారణంగా  ఆరోగ్యం బాగోలేకపోవటంతో  చెయ్యలేకపోయాను. గోవుల షెడ్ నిర్మిస్తున్నానని  ఏడాదిన్నర లోగా  నిర్మాణం పూర్తవుతుందని తెలిపింది. అలాగే తనకి అమౌంట్  పంపించిన వాళ్లందరికీ  ధన్యవాదాలు కూడా తెలిపింది
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com