![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కె.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'రాధేశ్యామ్'. ఈ మూవీలో ప్రభాస్ పెదనాన్న, సీనియర్ యాక్టర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన లుక్ ను విడుదల చేశారు మేకర్స్.
గతంలోనూ ప్రభాస్ సినిమాలలో కృష్ణంరాజు నటించారు. బిల్లా, రెబెల్ సినిమాలలో కీలక పాత్రల్లో కనిపించారు. ఇప్పుడు 'రాధేశ్యామ్' మూవీలో 'పరమహంస' అనే పాత్రలో కృష్ణంరాజు అలరించనున్నారు. 'పరమహంస'గా కృష్ణంరాజు లుక్ ని తాజాగా మూవీ టీమ్ రివీల్ చేసింది. కాషాయం దుస్తులు, రుద్రాక్ష మాలతో ఆధ్యాత్మిక గురువులా కనిపిస్తున్న కృష్ణంరాజు లుక్ ఆకట్టుకుంటోంది.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై పీరియాడికల్ లవ్ స్టొరీగా తెరకెక్కుతున్న 'రాధేశ్యామ్'లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |