![]() |
![]() |

ఈ జనరేషన్ యంగ్ హీరోలలో అతికొద్ది కాలంలోనే స్టార్ గా ఎదిగిన హీరో విజయ్ దేవరకొండ. 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం'.. ఇలా సినిమా సినిమాకి తన మార్కెట్ ని, క్రేజ్ ని పెంచుకుంటూ వచ్చాడు. అయితే కొంతకాలంగా విజయ్ వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నాడు. ఆయన రీసెంట్ మూవీ 'ఖుషి' పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా, బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా మిగిలింది. దానికి ప్రధాన కారణం మితిమీరిన బిజినెస్ అనే అభిప్రాయం ట్రేడ్ నుంచి, అభిమానుల నుంచి వినిపిస్తోంది.
2018 లో వచ్చిన 'టాక్సీవాలా' తర్వాత విజయ్ హిట్ ముఖం చూడలేదు. 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్', 'లైగర్' ఇలా ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్స్ గా నిలిచాయి. అయితే ఈ సినిమాలు బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చి, బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాలుగా మిగలడానికి ప్రధాన కారణం.. బిజినెస్ కావాల్సిన దానికంటే ఎక్కువ జరగడం. ముఖ్యంగా 'లైగర్' అయితే యంగ్ హీరోలలో రికార్డ్ స్థాయి బిజినెస్ అని చెప్పొచ్చు. జరిగిన బిజినెస్ కి తగ్గ కంటెంట్ సినిమాలో ఏమాత్రం లేకపోవడంతో బయ్యర్లు ఘోరంగా నష్టపోయారు.
ఇక విజయ్ రీసెంట్ మూవీ 'ఖుషి' పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా, బయ్యర్లకు పది కోట్లకు పైగా నష్టాలను మిగిల్చి, బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగలడానికి కూడా ఓవర్ బిజినెస్సే కారణం. విజయ్ ఫ్లాప్స్ లో ఉన్నప్పటికీ, లవ్ స్టోరీ అయినప్పటికీ, వారానికే 'జవాన్' వంటి భారీ సినిమా విడుదల ఉన్నప్పటికీ.. 'ఖుషి' రూ.50 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసింది. కానీ ఈ సినిమా రూ.40 కోట్ల షేర్ కే పరిమితమైంది. నిజానికి యంగ్ హీరోల సినిమాలకు రూ.40 కోట్ల షేర్ అనేది మంచి వసూళ్ళే. కానీ బిజినెస్ కారణంగా ఈ సినిమా కూడా ఫ్లాప్ లిస్టులో చేరిపోయింది. ఎంత పెద్ద హీరో అయినా వరుస ఫ్లాప్స్ వస్తే, డౌన్ ఫాల్ చూస్తాడు. అందుకే బిజినెస్ పరంగా రికార్డులు చూసుకొని, బయ్యర్లను నష్టాలపాలు చేసి, ఫ్లాప్ లు ఖాతాలో వేసుకునే కంటే.. పరిస్థితులను బట్టి థియేట్రికల్ రైట్స్ ని కాస్త తక్కువకు ఇచ్చేలా చూస్తే, అటు బయ్యర్లను సేవ్ చేసి, ఇటు ట్రాక్ రికార్డును మెరుగుపరుచుకోవచ్చు.
![]() |
![]() |