Home  »  News  »  క్రేజీ కాంబో: రవితేజ కోసం అదిరిపోయే కథ రాసిన బుచ్చిబాబు.!

Updated : Aug 17, 2026

'ఉప్పెన' వంటి బ్లాక్ బస్టర్ తో డైరెక్టర్ గా టాలీవుడ్‌కు పరిచయమైన బుచ్చిబాబు సానా.. రెండో సినిమా 'పెద్ది'ని ఏకంగా రామ్ చరణ్ తో చేసి సంచలనం సృష్టించారు. అయితే బుచ్చిబాబు దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వకముందు రాసిన మొదటి కథ మాస్ మహారాజా రవితేజ కోసం రాశారు. ఈ విషయాన్ని తాజాగా బుచ్చిబాబు స్వయంగా రివీల్ చేయడం విశేషం.

రవితేజ కొత్త సినిమా 'ఇరుముడి' ప్రీ-రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ వేడుకకు దర్శకుడు బుచ్చిబాబు గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని అందరి ముందు చెప్పారు. "నా మొదటి కథను రవితేజ గారి కోసమే రాసుకున్నాను. ఆ కథ ఇప్పటికీ నా దగ్గర అలాగే ఉంది. ఎప్పటికైనా ఆ కథను రవితేజ గారికి నేరేట్ చేస్తాను." అని చెప్పారు. 

బుచ్చిబాబు మాటలను బట్టి చూస్తే.. త్వరలోనే ఆయన రవితేజతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు అనిపిస్తోంది. 

ప్రస్తుతం బుచ్చిబాబు 'పెద్ది' సినిమాతో సూపర్ సక్సెస్ మీదున్నారు. ఆయన ఏ ప్రాజెక్ట్ చేసినా అది పాన్ ఇండియా రేంజ్‌లో ఉంటోంది. మరోవైపు రవితేజ కూడా 'ఇరుముడి'తో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టించాలని పట్టుదలగా ఉన్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే, అది టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది క్రేజీ ప్రాజెక్ట్ అయ్యే అవకాశముంది.

 

 

 

Irumudi Movie, Ravi Teja, Buchi Babu Sana, Peddi Movie

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.