Home

»

Latest News

రానా బ‌ర్త్ డేకి `భీమ్లా నాయ‌క్` స్పెష‌ల్ విజువ‌ల్ ట్రీట్!

Nov 27, 2021 3:10PM

మాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్`కి రీమేక్ గా రూపొందుతున్న చిత్రం `భీమ్లా నాయ‌క్`. ఇందులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ రోల్ లో న‌టిస్తుండ‌గా.. డేనియ‌ల్ శేఖ‌ర్ గా మ‌రో ప్ర‌ధాన పాత్ర‌లో ద‌గ్గుబాటి స్టార్ రానా క‌నిపించ‌నున్నారు. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాకి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌లు అందిస్తున్నారు. సితార ఎంట‌ర్టైన్మెంట్స్  సంస్థ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ బాణీలు అందిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా 2022 జ‌న‌వ‌రి 12న ఈ యాక్ష‌న్ డ్రామా థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది.

ఇదిలా ఉంటే.. ఇప్ప‌టికే మూడు పాట‌లు, కొన్ని స్పెష‌ల్ గ్లింప్స్ తో యూట్యూబ్ ముంగిట సంద‌డి చేస్తున్న `భీమ్లా నాయ‌క్`కి సంబంధించి త‌దుప‌రి స్పెష‌ల్ వీడియోకి ముహూర్తం ఫిక్స్ అయిందట‌. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. రానా బ‌ర్త్ డే స్పెష‌ల్ గా డిసెంబ‌ర్ 14న ఈ విజువ‌ల్ ట్రీట్ ఉండ‌బోతోంద‌ని తెలిసింది. రానా పోషిస్తున్న డానీ పాత్ర‌కు సంబంధించి పాట‌గానీ లేదా డైలాగ్ వీడియోగానీ ఆ రోజు ఉండొచ్చ‌న్న‌దే ఇన్ సైడ్ టాక్. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

కాగా, `భీమ్లా నాయ‌క్`లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి జంట‌గా నిత్యా మీన‌న్ న‌టిస్తుండ‌గా.. రానాకి జోడీగా సంయుక్తా మీన‌న్ ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com