![]() |
![]() |

రానా దగ్గుబాటి కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'అరణ్య'. హిందీలో 'హాథీ మేరె సాథీ', తమిళంలో 'కాండన్'గా రూపొందిన పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇది. ఏప్రిల్ 2న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, కరోనా అన్నిటినీ కకావికలం చేసింది. దాంతో సినిమా విడుదల వాయిదా పడింది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... ఈ సినిమా ఓటీటీ నుండి ఆఫర్ వచ్చిందట. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమాను తమకు ఇవ్వమని రానా తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్ బాబును ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ అప్రోచ్ అయిందట. నిజానికి, బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది. అయితే రానా హీరో కాబట్టి సురేష్ బాబు దగ్గరకు వచ్చారట. ఆయన దర్శకుడు, నిర్మాతలను సంప్రదించి ఏ విషయం చెబుతానని అన్నారట.
పర్యావరణ వేత్త జాదవ్ పాయంగ్ జీవితంగా ఆధారంగా రూపొందిన సినిమా ఇది. ఈ సినిమా కోసం రానా బరువు తగ్గి సన్నగా అయ్యారు. ఏనుగులు ఉన్న సీన్స్ షూటింగ్ చేయడానికి థాయ్ ల్యాండ్ వెళ్లారు. ఇందులో తమిళ హీరో విష్ణు విశాల్ కీలక పాత్ర పోషించారు.
![]() |
![]() |