![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాబాయ్ అంటే చరణ్‌కు ఎంతో ఇష్టం, గౌరవం. చిన్నప్పుడు వీరి మధ్య జరిగిన కొన్ని సరదా సంఘటనలను గతంలో జయప్రదం టాక్ షోలో రామ్ చరణ్ షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా తనకి, తన అక్కకి మధ్య పవన్ కళ్యాణ్ సరదాగా గొడవలు ఎలా పెట్టేవారో చరణ్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టామ్ అండ్ జెర్రీలా ఉండేవాళ్ళం!
రామ్ చరణ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ.. తన అక్క హనీ (సుస్మిత), తన మధ్య ఉన్న రిలేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మేమిద్దరం ఇంట్లో ఎప్పుడూ కొట్టుకుంటూ ఉండేవాళ్ళం. మా గొడవలు సరిగ్గా 'టామ్ అండ్ జెర్రీ' కార్టూన్ లాగే ఉండేవి. ఒకరినొకరు అస్సలు వదిలిపెట్టేవాళ్ళం కాదు" అని నవ్వుతూ చెప్పుకొచ్చారు.
మధ్యలో ఎంట్రీ ఇచ్చే కళ్యాణ్ బాబాయ్
వీరిద్దరి గొడవల మధ్యలోకి పవన్ కళ్యాణ్ ఎలా వచ్చేవారో చరణ్ వివరించారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ స్కూల్ నుంచి లేదా కరాటే ప్రాక్టీస్ నుంచి ఇంటికి వచ్చేవారట. సాయంత్రం మళ్ళీ ప్రాక్టీస్‌కు వెళ్ళే ముందు మధ్యలో దొరికిన గ్యాప్‌లో బాబాయ్‌కు బోర్ కొట్టేదట. అప్పుడు తనని, అక్కని పిలిచి సరదాగా ఆడుకునేవారని చరణ్ తెలిపారు.
రెచ్చగొట్టి వేడుక చూసేవారు!
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ వీరిద్దరినీ పిలిచి, ఒకరి మీద ఒకరికి లేనిపోని మాటలు చెప్పి సరదాగా గొడవ పెట్టేవారట. "చరణ్.. పొద్దున్న హనీ గురించి ఏదో అన్నావు కదా?" అంటూ సుస్మితకు చెప్పి ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేవారట. "ఏం చెప్పాడు బాబాయ్? చెప్పు చరణ్!" అని సుస్మిత అడగడంతో ఇక యుద్ధం మొదలయ్యేదట. అలా తనకి బోర్ కొట్టినప్పుడల్లా బాబాయ్ తమను 'కుక్ అప్' చేసి (రెచ్చగొట్టి) ఆ గొడవను చూసి ఎంజాయ్ చేసేవారని చరణ్ సరదాగా గుర్తు చేసుకున్నారు.
మెగా ఫ్యామిలీలో ఉండే అన్యోన్యతకు, బాబాయ్-అబ్బాయిల మధ్య ఉండే స్నేహానికి ఈ సంఘటన ఒక నిదర్శనం. ప్రస్తుతం రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగినా, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. అప్పటి ఆ చిన్ననాటి అల్లరి గుర్తులు మాత్రం ఎప్పటికీ ప్రత్యేకం. చరణ్ పంచుకున్న ఈ 'టామ్ అండ్ జెర్రీ' స్టోరీ మెగా అభిమానులను ఎంతగానో అలరిస్తోంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికర ఇంటర్వ్యూలు, సినీ విశేషాల కోసం మా 'తెలుగువన్ సినిమా' (TeluguOne Cinema) యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
![]() |
![]() |