![]() |
![]() |

ప్రముఖ సినీ నటుడు 300 పైగా చిత్రాలలో విభిన్న తరహ పాత్రలతో తనకంటూ తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని పదిలపరుచుకున్ననవరస నటుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కి, నట ప్రపూర్ణ టి.ఎల్. కాంతారావు స్మారక జాతీయ పురస్కారాన్ని ఆయన 102వ జయంతి (నవంబర్ 16న) సందర్భంగా అందించనున్నట్లు ఎంపిక కమిటీ చైర్మన్ కే.వి. రమణా చారి, కన్వీనర్ నాగబాల సురేష్ కుమార్ లు పత్రిక ప్రకటనలో తెలియచేసారు.
ఈ నెల 21వ తేదిన ఫిల్మ్ ఛాంబర్ లో జరిగే కార్యక్రమం లో ఈ అవార్డు ప్రదానం ఉంటుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణా రాష్ట్ర మంత్రివర్యులు కోమటి రెడ్డి వెంకట రెడ్డి , తెలంగాణా రాష్ట్ర ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు తో పాటు మరెందరో పరిశ్రమ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు పాల్గొంటున్నట్లు వారు తెలియ చేసారు.
గత 18 ఏళ్ళుగా కాంతారావు గారి జన్మ దినాన్ని తాము నవంబర్ 16న నిర్వహిస్తున్నామని, కాని ఈ సారి కొన్ని కారణాల వలన నవంబర్ 21న నిర్వహించాల్సి వచ్చిందని, ఆ రోజు కాంతారావు కుటుంభ సభ్యులు కూడా కార్యక్రమం లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
![]() |
![]() |