Home  »  News  »  Bharathiraja: కన్నీటి పర్యంతమైన రాధిక.. దర్శక శిఖరం భారతీరాజా పరిస్థితి ఇదే 

Updated : Apr 20, 2026

 

-దర్శకుడిగా ఎంతో మందికి గురువు 
 -ప్రస్తుతం వీల్ చైర్ కే పరిమితం 
-రాధికా శరత్ కుమార్ భావోద్వేగ  పోస్ట్ 

సెల్యులాయిడ్ కి సరికొత్త కథ, కథనం, టేకింగ్ పరిచయం చేసిన దర్శక శిఖరంలో 'భారతిరాజా'(Bharathiraja)ఒకరు. ముఖ్యంగా ప్రేమకథ చిత్రాలకి ఆయన పోసిన ప్రాణ బిక్ష ఎవరు పోసి ఉండరేమో. ఇలా ఆయన దర్శక ప్రతిభ గురించి చెప్పుకోవాలంటే రోజులు చాలవు.  తెలుగులో కూడా ఎన్నో అద్భుతమైన ప్రేమ కావ్యాలని అందించిన భారతీరాజా గత కొంత కాలం నుంచి శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతు వీల్ చైర్ కే పరిమితమయ్యారు.  ఈ క్రమంలో  సీనియర్ నటి రాధిక శరత్ కుమార్(Radhika Sarathkumar)సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రతి ఒక్కరి హృదయాల్ని తాకుతుంది. మరి ఆ పోస్ట్ ఏంటో చూద్దాం.

"నా దర్శకుడు, నా గురువు గారిని ఈ స్థితిలో చూడాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈ క్షణం నాకు ఎంతో విలువైనది. 'తాయ్ కిళవి' మూవీలో నా నటన చూసి, ఖచ్చితంగా నాకు  జాతీయ అవార్డు వస్తుందని దీవించారు. ఆయన నోటి నుంచి వచ్చిన ఆ మాట నాకు ప్రపంచంలోని ఏ అవార్డు కన్నా గొప్పది". సినిమాపై ఉన్న ప్రేమే ఆయన్ను ఈ స్థితిలోనూ ముందుకు నడిపిస్తోంది అని రాధిక రాసుకొచ్చింది. ఇక వీడియో కూడా షేర్ చేయడంతో భారతీరాజాని చూసిన అభిమానులు ఎంతగానో బాధపడుతు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Also read: Peddi: పెద్ది స్పెషల్ సాంగ్‌లో బాలయ్య హీరోయిన్.. రంగంలోకి ఫ్యాన్స్   

    
1978లో 'కిళక్కే పోగుమ్ రైల్' చిత్రంతో రాధికని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది భారతీరాజానే. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసే అవకాశం లేకుండా పోయింది. రాధిక నే కాదు ఎంతో మంది నటి నటీమణులకి నటనలో మెళుకువలు నేర్పి నట గురువు కూడా అయ్యారు. గత ఏడాది మార్చిలో తన కుమారుడు,నటుడైన  మనోజ్ భారతీరాజా గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించాడు. ఆ బాధ  ఆయన్ని మానసికంగా కుంగదీసింది. పైగా వయసు కూడా పెరగడంతో పలు అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టాయి. తెలుగులో చిరంజీవితో ఆరాధనతో పాటు తెలుగులో తెరకెక్కిన అతి తక్కువ మరణం లేని ప్రేమ కథా చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయే  'సీతాకోక చిలుక' కూడా భారతిరాజాదే.

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.