![]() |
![]() |
.webp)
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' (Peddi) గురించి అదిరిపోయే అప్‌డేట్స్ బయటికి వచ్చాయి. రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్న అవినాష్ కొల్లా 'తెలుగువన్'(TeluguOne)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు పెద్ది సినిమా ఎలా ఉండబోతుందో తెలియజేశారు.
విజయనగరం నేపథ్యంలో ఎమోషనల్ జర్నీ:
'పెద్ది' సినిమా కంప్లీట్ గా విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని అవినాష్ స్పష్టం చేశారు. ఇది ఒక పర్సన్ లైఫ్ జర్నీ అని, ముఖ్యంగా 1970 నుండి 1980 మధ్య కాలంలో జరిగే పీరియడ్ డ్రామా అని ఆయన వెల్లడించారు. పెద్ది అనే వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, సాధించిన విజయాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇది రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో కాకుండా, పూర్తిగా ఎమోషనల్ డ్రివెన్ కథగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
సెట్లు కాదు.. అదొక ప్రపంచం:
సినిమా కోసం విజయనగరంలోని గంటస్తంభం స్ట్రీట్ వంటి ఐకానిక్ లోకేషన్లను సెట్ రూపంలో క్రియేట్ చేసినట్లు అవినాష్ తెలిపారు. గ్లింప్స్‌లో కనిపించిన సెట్లే కాకుండా.. మొత్తం సినిమాలో దాదాపు 24 భారీ సెట్లు, 60 నుండి 70 వరకు చిన్న చిన్న సెటప్స్ వాడినట్లు ఆయన చెప్పారు. షుగర్ ఫ్యాక్టరీ ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందని, దీని కోసం లైవ్ లొకేషన్లతో పాటు భారీ సెట్లను కూడా నిర్మించినట్లు వివరించారు.
చికీరీ సాంగ్ - విజువల్ వండర్:
ఇక చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'చికీరీ' సాంగ్ మేకింగ్ గురించి చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సాంగ్ షూటింగ్ కోసం శ్రీలంకలోని దట్టమైన అడవుల్లో ప్రయాణించడమే కాకుండా, పూణేలోని 'ఎలిఫెంట్ నోస్' అనే అత్యంత కష్టతరమైన కొండ ప్రాంతానికి వెళ్లినట్లు తెలిపారు. అక్కడ షూట్ చేసిన విజువల్స్ ప్రేక్షకులను అబ్బురపరుస్తాయని, దాదాపు 36 జలపాతాల మధ్య సాగే ఈ పాట సినిమాకే హైలైట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
మల్టీ స్పోర్ట్స్ ఎలిమెంట్స్:
ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ లో చరణ్ ఒకసారి చేతిలో క్రికెట్ బ్యాట్ తో కనిపిస్తే, మరోసారి కుస్తీ యోధుడిలా కనిపించారు. దీనిపై క్లారిటీ ఇస్తూ.. సినిమాలో కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా కుస్తీ (Wrestling) వంటి ఇతర లోకల్ స్పోర్ట్స్ కూడా ఉంటాయని అవినాష్ చెప్పారు రామ్ చరణ్ పాత్ర కేవలం ఒక క్రీడాకారుడిగానే కాకుండా, ఎమోషనల్ గా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా బుచ్చిబాబు సానా మలిచారని ఆయన ప్రశంసించారు.
మొత్తానికి అవినాష్ కొల్లా మాటలను బట్టి చూస్తుంటే, చరణ్ కోసం బుచ్చిబాబు ఒక విజువల్ మరియు ఎమోషనల్ మాస్టర్ పీస్ ను సిద్ధం చేస్తున్నారని అర్థమవుతోంది.
మరిన్ని ఆసక్తికర ఇంటర్వ్యూలు, సినిమా అప్డేట్స్ కోసం 'తెలుగువన్' (TeluguOne) యూట్యూబ్ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.
![]() |
![]() |